NTV Telugu Site icon

Virat Kohli: కొత్త లుక్‌లో విరాట్ కోహ్లీ.. సోషల్ మీడియాలో వైరల్

Virat Kohli

Virat Kohli

Virat Kohli: టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్‌తో పాటు ట్రెండ్‌ను కూడా ఫాలో అవుతుంటాడు. తాజాగా ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌ కోసం విరాట్ కోహ్లీ మొహాలీ చేరుకున్నాడు. భారత్‌, ఆస్ట్రేలియా మధ్య తొలి టీ20 మ్యాచ్‌ ఈ నెల 20న మొహాలీలోని పీసీఏ స్టేడియంలో జరగనుంది. ఈ సందర్భంగా మొహాలీ ఎయిర్‌పోర్టులో విరాట్‌ కోహ్లీ దిగిన ఫొటోలను పీసీఏ తన ట్విటర్‌లో పంచుకుంది. ఈ ఫోటోల్లో కొత్త హెయిర్‌ స్టైల్‌లో కనిపించాడు. అతడి కొత్త లుక్‌ అభిమానులను ఆకట్టుకుంటోంది. సెలబ్రిటీ హెయిర్ స్టయిలిస్ట్ రషీద్ సల్మాని కోహ్లీకి హెయిర్ కట్ చేసి కొత్త లుక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అతడు కూడా కోహ్లీ ఫోటోలను ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ‘న్యూ లుక్ ఫర్ కింగ్ కోహ్లీ’ అని క్యాప్షన్ ఇచ్చాడు.

Read Also: Typhoon Nanmadol: జపాన్‌ను భయపెడుతున్న తుఫాన్.. 20 లక్షల మంది ప్రజలపై ప్రభావం

విరాట్ కోహ్లీ కొత్త హెయిర్ స్టైల్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కోహ్లీ కొత్త లుక్ బాగుందని అభిమానుల నుంచి కామెంట్లు వస్తున్నాయి. మరోవైపు ఆసియాకప్‌లో రాణించిన కోహ్లీ రానున్న టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాకు కీలకంగా మారాడు. సుమారు మూడేళ్ల తర్వాత కోహ్లీ సెంచరీ చేయడంతో అతడిపై అంచనాలు పెరిగిపోయాయి. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా వంటి బలమైన జట్లతో సొంతగడ్డపై జరిగే టీ20 సిరీస్‌లలో విరాట్ కోహ్లీ ఎలా రాణిస్తాడో చూడాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అటు విరాట్ కోహ్లీని తాను మిస్ అవుతున్నానని అతడి భార్య అనుష్క శర్మ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. ‘ఈ వ్యక్తితో ఉంటే ప్రపంచం చాలా ప్రకాశవంతంగా, మరింత ఉత్సాహంగా, ఎంతో సరదాగా… అంతకుమించి అందంగా కనిపిస్తుంది. ఇతనితో కలిసి హోటల్ గదిలో బయో బబుల్‌లో గడిపినా బాగుంటుంది…’ అంటూ అనుష్క శర్మ పోస్ట్ చేసింది. ఈ పోస్టులో ‘#MissingHubby టూ మచ్ పోస్ట్’ అంటూ రాసుకొచ్చింది.