Site icon NTV Telugu

Virat Kohli History: సచిన్ మరో ప్రపంచ రికార్డు బద్దలు.. ఇక ‘కింగ్’ కోహ్లీని కొట్టేవాడే లేడు!

Virat Kohli History

Virat Kohli History

టీమిండియా స్టార్ క్రికెటర్‌ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులను గెలుచుకున్న తొలి క్రికెటర్‌గా నిలిచాడు. భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో అవార్డు గెలుచుకోవడం ద్వారా కోహ్లీ ఈ అరుదైన రికార్డు నెలకొల్పాడు. కింగ్ తన అభిమాన క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో విరాట్ ఇప్పటివరకు 20 ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు గెలుచుకున్నాడు.

భారత్, దక్షిణాఫ్రికా సిరీస్ ముందు వరకు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీలు సంయుక్తంగా అగ్ర స్థానంలో ఉన్నారు. స్వదేశంలో జరిగిన దక్షిణాఫ్రికా సిరీస్‌లో రెండు సెంచరీలు, ఒక హాఫ్‌ సెంచరీతో 302 పరుగులు చేసిన కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచి.. అగ్ర స్థానంలోకి దూసుకెళ్లాడు. బంగ్లాదేశ్‌కు మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ (17), దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్‌ జాక్వెస్ కాలిస్ (14), శ్రీలంక మాజీ ఓపెనర్ సనత్ జయసూర్య (13), ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (13) ఈ జాబితాలో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ప్రస్తుత ఆటగాళ్లలో ఒక్కరు కూడా 10 ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు కూడా గెలుచుకోలేదు. భవిష్యత్తులో కూడా 20 అవార్డులు అంటే మాములు విషయం కాదు. నిజం చెప్పాలంటే.. ఇక కోహ్లీని కొట్టేవాడే లేడు.

Also Read: Virat Kohli: ఏదైనా ప్రత్యేకంగా చేయాలనుకున్నా.. ఐయామ్ ఫుల్ హ్యాపీ, సిద్ధంగా ఉన్నా!

మరోవైపు వన్డేల్లో విరాట్ కోహ్లీకి ఇది 11వ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు. శ్రీలంక దిగ్గజం సనత్ జయసూర్యతో కలిసి విరాట్ ఇప్పుడు రెండవ స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 14 అవార్డులతో అగ్ర స్థానంలో ఉన్నారు. విండీస్ మాజీ ఓపెనర్, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ 8 అవార్డులతో మూడో స్థానంలో ఉన్నాడు. దక్షిణాఫ్రికా మాజీ పేసర్ షాన్ పొల్లాక్ కూడా 8 ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌ అవార్డులు గెలుచుకున్నాడు. విరాట్ ఇప్పుడు అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. 2027 ప్రపంచకప్ వరకు ఆడతానని చెప్పకనే చెప్పాడు. అప్పటివరకు ఇదే ఫామ్ కొనసాగిస్తే సచిన్ రికార్డు కూడా బ్రేక్ అవుతుంది.

Exit mobile version