Eng vs NZ: లార్డ్స్ టెస్టులో బౌలర్ల హవా.. తొలి రోజే 16 వికెట్లు డౌన్.. అసలేమవుతోంది.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Eng vs NZ: ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో ప్రారంభమైన తొలి టెస్టు మ్యాచ్ తొలి రోజే బౌలర్ల ఆధిపత్యానికి వేదికగా మారింది. ఒకే రోజులో మొత్తం 16 వికెట్లు పడటంతో బ్యాటర్లకు కఠిన పరీక్ష ఎదురైంది. మొదటిరోజు ముగిసే సమయానికి న్యూజిలాండ్ 66/6 స్కోరుతో నిలిచి, ఇంకా 79 పరుగులు వెనుకబడి ఉంది.
ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో 4-1 తేడాతో పరాజయం పాలైన ఇంగ్లండ్ జట్టు, న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో కొత్త ఆరంభం కోసం జట్టులో మార్పులు చేసింది. జాక్ క్రాలీ, ఒల్లీ పోప్ లను తప్పించి ఎమిలియో గే, జేకబ్ బెతెల్ లకు అవకాశం కల్పించింది. అయితే ఈ మార్పులు కూడా బ్యాటింగ్ విభాగానికి ఊపిరి పోయలేకపోయాయి. టాస్ అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ప్రారంభం నుంచే కివీస్ పేసర్ల దాడికి తట్టుకోలేకపోయింది. అరంగేట్ర ఆటగాడు ఎమిలియో గే ఒక బౌండరీతో ఇన్నింగ్స్ ఆరంభించినప్పటికీ కేవలం 8 పరుగులకే వెనుదిరిగాడు. అనంతరం జేకబ్ బెతెల్, జో రూట్, బెన్ డకెట్‌లు కూడా త్వరగా పెవిలియన్ చేరడంతో ఇంగ్లండ్ 34 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
Also Read
- Cardiac Arrest: కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు ఈ ఒక్క పని ప్రాణాలు కాపాడొచ్చు.. ఒక్క నిమిషం ఆలస్యమైనా..
- CM Chandrababu Prakasam District Visit: నేడు ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన..
- Astrology: అక్టోబర్ 09 శుక్రవారం దినఫలాలు.. ఈ పరిహారం చెల్లిస్తే అంతా శుభమే..!
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
ఈ సమయంలో హ్యారీ బ్రూక్ ఒంటరి పోరాటం చేశాడు. అతడు 56 పరుగులతో జట్టును ఆదుకునే ప్రయత్నం చేసినప్పటికీ.. మరో ఎండ్‌లో సరైన సహకారం లభించలేదు. ఫలితంగా ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 140 పరుగులకే ఆలౌట్ అయింది. న్యూజిలాండ్ తరఫున కైల్ జేమీసన్ అద్భుత బౌలింగ్‌తో చెలరేగాడు. అతడు ఐదు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ బ్యాటింగ్‌ను కుదేలు చేశాడు. అతనికి తోడుగా నాథన్ స్మిత్ 3 వికెట్లు, విలియం ఓ’రూర్కే 2 వికెట్లు తీసి మద్దతు అందించారు.
అయితే 140 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని దాటేసి తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం అందుకోవాలని భావించిన న్యూజిలాండ్ కు ఇంగ్లండ్ పేసర్లు భారీ షాక్ ఇచ్చారు. ముఖ్యంగా ఒల్లీ రాబిన్సన్ తన రెండో ఓవర్ లోనే డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్, రచిన్ రవీంద్ర వికెట్లను పడగొట్టి మ్యాచ్ స్వరూపాన్ని పూర్తిగా మార్చేశాడు. దీంతో కివీస్ కేవలం 2 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత టామ్ లాథమ్ కూడా ఎక్కువసేపు నిలవలేకపోయాడు. డారిల్ మిచెల్ కొంతసేపు ప్రతిఘటించినప్పటికీ 12 పరుగుల వద్ద రాబిన్సన్ వేసిన అద్భుత ఇన్‌స్వింగర్‌కు బౌల్డ్ అయ్యాడు. టామ్ బ్లండెల్ కూడా కేవలం 4 పరుగులకే ఔటవడంతో న్యూజిలాండ్ మరింత ఒత్తిడిలో పడింది. దీనితో మొదటి రోజు ముగిసే సమయానికి న్యూజిలాండ్ 66/6 స్కోరుతో నిలిచింది. ప్రస్తుతం గ్లెన్ ఫిలిప్స్, నాథన్ స్మిత్ క్రీజులో ఉండగా.. తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించాలంటే మరో 79 పరుగులు చేయాల్సి ఉంది.
తాజావార్తలు
-
Red Magic 12 Pro+: 8,400mAh బ్యాటరీతో Red Magic 12 Pro+.. RGB లిక్విడ్ కూలింగ్‌తో కొత్త గేమింగ్ ఫోన్!
-
IND vs WI 2nd T20: నేడు భారత్, వెస్టిండీస్ రెండో టీ20.. పిచ్ రిపోర్ట్, వాతావరణం, ప్లేయింగ్ 11 ఇదే!
-
Cardiac Arrest: కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు ఈ ఒక్క పని ప్రాణాలు కాపాడొచ్చు.. ఒక్క నిమిషం ఆలస్యమైనా..
-
NANI : డ్యామేజైన ఫ్యామిలీ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న నేచురల్ స్టార్
-
CM Chandrababu Prakasam District Visit: నేడు ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన..
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!