NTV Telugu Site icon

సౌత్ ఆఫ్రికా వన్డే సిరీస్ పై స్పష్టం చేసిన విరాట్…

బీసీసీఐ తన వన్డే కెప్టెన్సీ తీసేసిందనే కోపంతో విరాట్ కోహ్లీ సౌత్ ఆఫ్రికా పర్యటనలో జరగనున్న వన్డే సిరీస్ కు దూరం అవుతున్నాడు అని వార్తలు వచ్చాయి. వ్యక్తిగత కారణాల పేరిట తాను ఈ సిరీస్ దూరం కానున్నాడు అని అన్నారు. కానీ ఇప్పుడు అలాంటిది ఏం లేదు అని ఈ భారత టెస్ట్ కెప్టెన్ క్లారిటీ ఇచ్చాడు.

Read Also : దాదాకి కోహ్లీ కౌంటర్… కెప్టెన్ గా తప్పుకోవద్దని చెప్పలేదు..!

అయితే టీం ఇండియా దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు విలేఖరులతో కోహ్లీ మాట్లాడుతూ… సొసైల్ మీడియాలో వస్తున్న వార్తలు మొత్తం అవాస్తవం. అందులో చెప్పిన విధంగా నేను ఎప్పుడు విశ్రాంతి కావాలని బీసీసీఐని కోరలేదు. ఈ పర్యటనలో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు నేను అందుబాటులో ఉంటాను అని కోహ్లీ చెప్పాడు. అయితే ఈ పర్యటనలో దక్షిణాఫ్రికా తో మొదట మూడు టెస్ట్ ల సిరీస్ లో తలపడనున్న భారత జట్టు ఆ తర్వాత వచ్చే ఏడాది జనవరి 19, 21, 23 తేదీల్లో మూడు వన్డేల సిరీస్ జరగనుంది.