Virat Kohli: టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీకి ప్రపంచ వ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సచిన్, ధోనీ తర్వాత ఆ స్థాయిలో ఫాలోయింగ్ ఉన్న క్రికెటర్ కోహ్లీ మాత్రమే. గతంలో పరుగుల వరద పారించిన కోహ్లీ మూడేళ్ల పాటు ఫామ్ కోల్పోయి తంటాలు పడ్డాడు. అయితే ఇటీవల ఆసియా కప్ సందర్భంగా తిరిగి ఫామ్‌లోకి వచ్చిన అతడు టీ20 ప్రపంచకప్‌లో మరోసారి రికార్డులను కొల్లగొడుతున్నాడు. ఇప్పటికే ఈ ప్రపంచకప్‌లో నాలుగు మ్యాచ్‌లలో మూడు హాఫ్ సెంచరీలతో సత్తా చాటాడు.
Read Also: Afghanistan: కెప్టెన్సీకి రాజీనామా చేసిన నబీ.. సెలక్టర్లు జట్టు ఎంపిక చేసేది ఇలాగేనా?
నవంబర్ 5న కోహ్లీ పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా అభిమానులు సంబరాలు చేసుకున్నారు. తెలుగు అభిమానులు కూడా కోహ్లీపై తమ ప్రేమను చాటుకున్నారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సుదర్శన్ థియేటర్ వద్ద 50 అడుగుల కోహ్లీ కటౌట్ ఏర్పాటు చేశారు. సాధారణంగా ఇక్కడ తెలుగు స్టార్ హీరోల కటౌట్స్ మాత్రమే పెడుతుంటారు. ఇప్పుడు వారి స్థానంలో కోహ్లీ కటౌట్ ప్రత్యేకంగా కనిపిస్తూ అందరినీ ఆకర్షిస్తోంది. దీంతో ఈ ఘటన సాధించిన తొలి క్రికెటర్‌గా ఈ ఘనత సాధించాడు. ప్రస్తుతం కోహ్లీ కటౌట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అటు విజయవాడలో 40 అడుగుల కోహ్లీ కటౌట్, ముంబైలో ఓ పెద్ద గోడపై కోహ్లీ పెయింటింగ్ కూడా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. దీంతో కోహ్లీ అభిమానులు వీటిని షేర్ చేస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
https://twitter.com/imvishwajeet99/status/1588723546473529344
