Vijay Hazare Trophy 2025-26: విజయ్ హజారే ట్రోఫీ.. రో-కోల మ్యాచ్ ఫీజ్ ఎంతో తెలుసా?
- విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో ఆడుతున్న రో-కో
- ఢిల్లీ తరఫున కోహ్లీ.. ముంబై తరఫున బరిలోకి రోహిత్
- రో-కోలకు ఎంత మ్యాచ్ ఫీజు వస్తుందో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ అనంతరం టీమిండియా స్టార్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు దేశవాళీ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో ఆడుతున్నారు. ఢిల్లీ తరఫున కోహ్లీ.. ముంబై తరఫున రోహిత్ బరిలోకి దిగారు. దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ ఫామ్ కంటిన్యూ చేస్తూ.. పరుగుల వరద పారిస్తున్నారు. ఎంతటి స్టార్స్ అయినా సరే దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందే అని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అల్టిమేటం జారీ చేసిన నేపథ్యంలో ఈ ఇద్దరు విజయ్ హజారే ట్రోఫీలో ఆడుతున్నారు. అయితే భారత్ తరఫున ఆడినప్పుడు ఒక్కో వన్డేకు రూ. 6 లక్షలు ఫీజు తీసుకునే రో-కోలకు విజయ్ హజారే ట్రోఫీలో ఎంత వస్తుందో అని ఫాన్స్ తెగ వెతుకుతున్నారు.
విజయ్ హజారే ట్రోఫీ లిస్ట్-ఎ మ్యాచ్‌లలో ఆడే ఆటగాళ్లను వారు ఆడిన మ్యాచ్‌ల సంఖ్య ఆధారంగా మూడు కేటగిరీలుగా బీసీసీఐ విభజించింది. సీనియర్ కేటగిరీ, మిడ్-లెవల్ కేటగిరీ, జూనియర్ కేటగిరీలలో ఫీజు చెల్లిస్తారు. సీనియర్ కేటగిరీలో 40కి పైగా లిస్టు-ఎ మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్స్ ఉంటారు. మ్యాచ్ ఆడిన ఆటగాడికి రూ.50 వేలు, రిజర్వు అతగాడికి రూ 25 వేల చొప్పున ఫీజును బీసీసీఐ చెల్లిస్తుంది. మిడ్-లెవల్ కేటగిరీలో 21 నుంచి 40 లిస్టు-ఎ మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లు ఉండగా.. ఒక్కో మ్యాచ్‌కు రూ.50 వేలు, రూ.25 వేల చొప్పున ఫీజు ఉంటుంది. జూనియర్ కేటగిరీలో 0- 20 లిస్టు-ఎ మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్స్ ఉండగా.. రూ. 40 వేలు, రూ.20 వేల చొప్పున ఫీజు అందిస్తారు. ఫీజుతో పాటు అలవెన్సులు అదనంగా ఉంటాయి. ట్రావెల్, ఫుడ్ ఖర్చు, వసతి ఏర్పాటును బీసీసీఐ చూసుకుంటుంది.
Also Read
- Suryakumar Yadav: తప్పంతా నాదే.. వన్డే కెరీర్‌పై సూర్యకుమార్ సంచలన వ్యాఖ్యలు!
- Fit India Ambassador: గౌతమ్ గంభీర్‌కు భావోద్వేగ క్షణం.. కుమార్తె ఆజీన్‌కు అరుదైన గౌరవం
- Asia Cup 2026: పాకిస్థాన్‌తో హ్యాండ్‌షేక్ ఉంటుందా?.. టీమిండియా కోచ్ ఏం చెప్పాడంటే?
- BCCI-Team India: ఉన్నపళంగా బెంగళూరుకు టీమిండియా స్టార్ క్రికెటర్లు.. ఎందుకో తెలుసా?
విజయ్ హజారే ట్రోఫీలో సీనియర్ కేటగిరీలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఉన్నారు. కాబట్టి వారికి రూ.60 వేలతో పాటు అలవెన్సులు దక్కుతాయి. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలిచిన ఆటగాడికి రూ.10 వేల ప్రైజ్‌మనీ ఉంటుంది. ఇక రో-కో రాకతో విజయ్ హజారే ట్రోఫీ 2025 సీజన్‌కు పండుగ కళ వచ్చింది. కోహ్లీ, రోహిత్ ఆట చూస్తూ స్థానిక ఫాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. 2026 జనవరిలో భారత్‌లో న్యూజిలాండ్ పర్యటించనుంది. ఈ పర్యటన నేపథ్యంలో ఇరు జట్లు మూడు వన్డే మ్యాచ్‌లు ఆడనున్నాయి. వన్డేల్లో రో-కో ఆడనున్నారు.
తాజావార్తలు
-
Nepal Floods: “నువ్వు దేవుడు సామీ”.. వరదల్లో 1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన ప్రిన్సిపాల్
-
Suryakumar Yadav: తప్పంతా నాదే.. వన్డే కెరీర్‌పై సూర్యకుమార్ సంచలన వ్యాఖ్యలు!
-
IIT Deaths: ఐఐటీల్లో ఈ చావులు వెనుక ఉన్న కారణాలేంటి? విద్యార్థులను బలి తీసుకుంటుంది ఎవరు?
-
NEET Counselling 2026: NEET కౌన్సెలింగ్ తొలి విడతలో సీటు రాకపోవడంతో.. 21 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య
-
Laikey Laikaa: రాషా థడానీ ఇంటెన్స్ రొమాంటిక్ యాక్షన్ ఆగిపోలేదు.. వాలెంటైన్స్ డేకు వస్తోంది..
ట్రెండింగ్
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!