Vaibhav Suryavanshi: నెల రోజుల్లో 4సార్లు..మరో సచిన్‌లా మారుతున్న వైభవ్..ఈ లెక్కలే సాక్ష్యం !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaibhav Suryavanshi : క్రికెట్ లో కొందరు ఆటగాళ్లు పెద్ద స్కోర్లు చేస్తారు. మరికొందరు ఒత్తిడిని తట్టుకుని ఆడతారు. కానీ చాలా అరుదుగా మాత్రమే ఒక ఆటగాడిలో ఈ రెండు లక్షణాలు ఒకేసారి కనిపిస్తాయి. ఇప్పుడు భారత క్రికెట్ లో అలాంటి పేరు గురించి చర్చ జరుగుతోంది. అతడే వైభవ్ సూర్యవంశీ. కేవలం 15 ఏళ్ల వయసులోనే అతడు ఆడుతున్న ఇన్నింగ్స్ లు చూస్తే వయసు సంఖ్య మాత్రమే అనిపిస్తోంది.
శ్రీలంక-A జట్టుతో జరిగిన ట్రై సిరీస్ ఫైనల్లో మరోసారి వైభవ్ బ్యాట్ గర్జించింది. క్రీజులోకి వచ్చిన కాసేపటికే బౌలర్లపై ఎదురుదాడి ప్రారంభించిన అతడు కేవలం 29 బంతుల్లోనే 94 పరుగులు చేశాడు. శతకం వైపు దూసుకెళ్తున్న సమయంలో అవుట్ కావడంతో మరోసారి మూడు అంకెల స్కోరు అందకుండా పోయింది. అయితే అతడి ఇన్నింగ్స్ చూసిన వారంతా ఒకే విషయం చెబుతున్నారు. ఈ కుర్రాడికి పెద్ద వేదిక అంటే భయం లేదు. ఒత్తిడి అంటే టెన్షన్ లేదు. మ్యాచ్ ఎంత కీలకమైనదైనా అతడి బ్యాటింగ్ మాత్రం అలాగే కొనసాగుతోంది.
Also Read
- PV Sindhu Creates History : హైలో ఓపెన్‌లో సింధు చరిత్ర.. తొలి భారతీయ మహిళగా అరుదైన ఘనత
- Ind Vs NZ: భారత్‌పై న్యూజిలాండ్ ఘన విజయం.. సిరీస్ కైవసం చేసుకున్న ఇండియా..
- Ind vs NZ: హాఫ్ సెంచరీలతో అదరగొట్టిన ఇషాన్, శ్రేయస్ అయ్యర్.. టీమిండియా స్కోర్ ఎంతంటే..
- Ind Vs NZ 5th T20: టాస్ గెలిచిన న్యూజిలాండ్.. టీమిండియా జట్టులోకి కీలక ప్లేయర్లు ఎంట్రీ..
అసలు 2026లో వైభవ్ ఆడిన నాకౌట్ మ్యాచ్‌ల గణాంకాలు చూస్తే ఈ విషయం మరింత స్పష్టంగా తెలుస్తుంది. అండర్ 19 ప్రపంచకప్ సెమీఫైనల్లో 33 బంతుల్లో 68 పరుగులు చేశాడు. ఫైనల్లో అయితే 80 బంతుల్లో 175 పరుగులతో ప్రత్యర్థి బౌలర్లను చిత్తు చేశాడు. ఐపీఎల్ ఎలిమినేటర్ లో 29 బంతుల్లో 97 పరుగులు చేశాడు. క్వాలిఫైయర్ లో 47 బంతుల్లో 96 పరుగులు సాధించాడు. ఇప్పుడు ట్రై సిరీస్ ఫైనల్లో 29 బంతుల్లో 94 పరుగులతో మరోసారి తన ముద్ర వేశాడు.
ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం కనిపిస్తోంది. గత నెల రోజుల్లోనే వైభవ్ నాలుగు సార్లు 90లలో అవుట్ అయ్యాడు. 97, 96, 94, 93 వంటి స్కోర్లు అతడి ఖాతాలో చేరాయి. సాధారణంగా ఒక బ్యాటర్ కు ఒకసారి 90ల్లో అవుట్ అయితే బాధగా ఉంటుంది. రెండుసార్లు జరిగితే దురదృష్టంగా భావిస్తారు. కానీ వైభవ్ విషయంలో మాత్రం వేరే కథ కనిపిస్తోంది. ఎందుకంటే అతడు 90ల్లో ఆగిపోతున్నాడు గానీ అక్కడికి చేరుకోవడమే ప్రత్యర్థి బౌలర్లకు అసాధ్యంగా మారుతోంది.
ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ స్కోర్లు సాధారణ లీగ్ మ్యాచ్ ల్లో రావడం లేదు. సెమీఫైనల్, ఫైనల్, ఎలిమినేటర్, క్వాలిఫైయర్ లాంటి అత్యంత కీలక మ్యాచ్ ల్లోనే వస్తున్నాయి. చాలా మంది ఆటగాళ్లు లీగ్ దశలో అద్భుతంగా ఆడి నాకౌట్ మ్యాచ్ ల్లో తడబడతారు. కానీ వైభవ్ మాత్రం పెద్ద మ్యాచ్ వచ్చిందంటే మరింత ప్రమాదకరంగా మారుతున్నాడు. ఇదే అతడిని ప్రత్యేకంగా నిలబెడుతోంది.
భారత క్రికెట్ చరిత్రలో ఎంతో మంది యువ ప్రతిభావంతులు వచ్చారు. కానీ 15 ఏళ్ల వయసులోనే దేశవ్యాప్తంగా ఇంత చర్చకు కారణమైన ఆటగాళ్లు చాలా తక్కువ. వైభవ్ ఇప్పుడు కేవలం పరుగులు మాత్రమే చేయడం లేదు. భవిష్యత్తుపై అంచనాలను కూడా పెంచుతున్నాడు. అతడి బ్యాటింగ్ లో కనిపిస్తున్న ఆత్మవిశ్వాసం, షాట్లలో కనిపిస్తున్న దూకుడు, కీలక మ్యాచ్ ల్లో కనిపిస్తున్న స్థిరత్వం అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాయి.
అవును… శతకం మరోసారి చేజారిపోయింది. 90లలో మరోసారి ఆగిపోయాడు. కానీ ఇప్పుడు చర్చ శతకం గురించి కాదు. ప్రతి పెద్ద మ్యాచ్ లో జట్టుకు అండగా నిలుస్తున్న ఈ 15 ఏళ్ల కుర్రాడి గురించి. ఎందుకంటే క్రికెట్ లో కొన్నిసార్లు మూడు అంకెల స్కోరు కంటే కూడా పరిస్థితులకు తగ్గట్టు ఆడిన ఇన్నింగ్స్ విలువ ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ ఆడుతున్న ప్రతి ఇన్నింగ్స్ అదే విషయాన్ని గుర్తు చేస్తోంది.
తాజావార్తలు
-
Dulquer Salmaan: “టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా”
-
Rapthadu School Attack : రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు..
-
Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
-
PV Sindhu Creates History : హైలో ఓపెన్‌లో సింధు చరిత్ర.. తొలి భారతీయ మహిళగా అరుదైన ఘనత
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..