Vaibhav Suryavanshi: మూడో టీ20కి ముందు టీమిండియాకు షాక్.. నెట్స్‌లో గాయపడ్డ ఓపెనర్ వైభవ్! ఇప్పుడు ఎలా ఉన్నాడంటే?
- నెట్స్‌లో ఘోర ప్రమాదం
- టీమిండియా ఓపెనర్ వైభవ్‌కు గాయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaibhav Suryavanshi: ఇంగ్లాండ్‌తో జరగబోయే కీలకమైన మూడో టీ20 మ్యాచ్‌కు ముందు టీమిండియా క్యాంప్‌లో తీవ్ర కలకలం రేగింది. టీమిండియా యువ సంచలనం, ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) నెట్స్ ప్రాక్టీస్ చేస్తుండగా ఒక భయానక ప్రమాదం జరిగింది. బ్యాటింగ్ ప్రాక్టీస్ సమయంలో బంతి బలంగా తగలడంతో ఈ 15 ఏళ్ల ‘బేబీ బాస్’ తీవ్రమైన నొప్పితో పిచ్‌పైనే కుప్పకూలిపోయాడు. ట్రెంట్ బ్రిడ్జ్ మైదానంలో టీమిండియా ఆటగాళ్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ చేస్తుండగా, టీమిండియా థ్రో డౌన్ స్పెషలిస్ట్ రఘు అత్యంత వేగవంతమైన షార్ప్ బౌన్సర్‌ను విసిరాడు. ఆ బంతిని పుల్ షాట్ ఆడేందుకు వైభవ్ ప్రయత్నించగా.. టైమింగ్ మిస్ అవ్వడంతో బంతి నేరుగా వచ్చి అతని ఛాతి, పొట్ట మధ్య భాగంలో బలంగా తాకింది. బంతి తగిలిన వెంటనే వైభవ్ నొప్పితో విలవిలలాడుతూ కింద కూర్చుండిపోయాడు. దీంతో వెంటనే ప్రాక్టీస్ సెషన్‌ను నిలిపివేసి, అతనికి ప్రాథమిక చికిత్స అందించి నీళ్లు తాగించారు.
ఇప్పుడు వైభవ్ పరిస్థితి ఎలా ఉందంటే..
టీమిండియా మేనేజ్మెంట్తో పాటు అభిమానులందరూ ఊపిరి పీల్చుకునే విషయం ఏమిటంటే.. ఈ యంగ్ సెన్సేషన్‌కు ఎలాంటి తీవ్రమైన గాయం కాలేదు. బంతి బలంగా తాకినప్పటికీ.. కేవలం 5 నుంచి 6 నిమిషాల వ్యవధిలోనే కోలుకున్న వైభవ్, మళ్లీ పట్టుదలతో బ్యాట్ పట్టి బరిలోకి దిగాడు. గాయానికి ముందు ఎంత దూకుడుగా ఆడాడో, కోలుకున్న తర్వాత కూడా అదే ఉత్సాహంతో షార్ట్ పిచ్ బంతులను బౌండరీలకు తరలిస్తూ కనిపించాడు. తన డెబ్యూ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ బౌలర్లు షార్ట్ బాల్స్‌తో ఇబ్బంది పెట్టడంతో, ఈసారి దానికి గట్టి కౌంటర్ ఇచ్చేందుకు వైభవ్ నెట్స్‌లో గట్టిగా శ్రమిస్తున్నాడు. వైభవ్ సూర్యవంశీ ప్రాక్టీస్ సెషన్లో మరో ఆసక్తికరమైన దృశ్యం కనిపించింది. ఈ 15 ఏళ్ల వండర్ కిడ్ బ్యాటింగ్ చేస్తుంటే, మరో ఓపెనర్ అభిషేక్ శర్మ పక్కనే నిలబడి అత్యంత నిశితంగా గమనించాడు. వైభవ్ ఏ బంతిని ఎలా ఎదుర్కొంటున్నాడు, ఎలాంటి షాట్లు ఆడుతున్నాడనే దానిపై దృష్టి పెట్టాడు. వైభవ్‌కు ఎలాంటి సలహాలు ఇవ్వనప్పటికీ.. అతడిని చూసి నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నట్లు అనిపించింది. వైభవ్ ఒక్కో షాట్ కొట్టిన ప్రతిసారీ.. అభిషేక్ కూడా పక్కనే షాడో ప్రాక్టీస్ చేస్తూ కనిపించడం విశేషం.
Also Read
- NZ vs IND 1st ODI: వన్డేలకు వేళాయే.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదిగో..!
- NZ Vs IND: మరో సమరానికి సిద్ధంగా టీమిండియా.. రేపే మొదటి వన్డే..
- Hardik Pandya IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్ భారీ స్కెచ్.. ముంబై నుంచి హార్దిక్ పాండ్యా కోసం ఆ ఇద్దరు ఆటగాళ్ల ట్రేడ్ డీల్..?
- IPL 2027 Auction: ఐపీఎల్ 2027 వేలంలో పాకిస్థాన్ ఆటగాడు..? డిసెంబర్ 16న మినీ వేలం..
భారత్‌కు చావో రేవో సమరం..
ఇంగ్లాండ్‌తో జరగనున్న మూడో టీ20 మ్యాచ్ టీమిండియాకు అత్యంత కీలకంగా మారింది. ఇప్పటికే సిరీస్‌లో వెనుకబడిన భారత్.. ఈ మ్యాచ్‌లో ఓడిపోతే ఐర్లాండ్ సిరీస్ తర్వాత ఈ సిరీస్ కూడా చేజారిపోయే ప్రమాదం ఉంది. ఒకరకంగా చెప్పాలంటే మిగిలిన మూడు మ్యాచ్‌లు భారత్‌కు ‘చావో రేవో’ లాంటివే. ఈ నేపథ్యంలో పవర్‌ప్లేలో జట్టుకు మెరుపు ఆరంభాన్ని ఇవ్వడంలో వైభవ్ సూర్యవంశీ పాత్ర అత్యంత కీలకం కానుంది. ఈ మ్యాచ్‌లో ‘బేబీ బాస్’ బ్యాట్ ఝుళిపిస్తేనే టీమిండియా విజయావకాశాలు మెరుగవుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
-
CM Chandrababu: మురసు తుఫాన్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష.. 45 వేల మందికి పైగా అధికారులతో టెలికాన్ఫరెన్స్
-
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
-
SIR Protest: SIR పోరాటంలో కాంగ్రెస్ కొత్త ప్లాన్.. నవంబర్ 5న బెంగళూర్‌లో నిరసన!
-
Pulivendula Election Results: 43 ఏళ్ల చరిత్రలో తొలిసారి.. పులివెందులలో ఎగిరిన టీడీపీ జెండా..
ట్రెండింగ్
-
Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!
-
Cheesy Chicken Pasta Recipe: కేవలం 15 నిమిషాల్లో చీజీ చికెన్ పాస్తా.. ఇంట్లోనే సులభంగా చేసేయండి.!
-
Laundry Tips : హోటల్ టవల్స్ ఎప్పుడూ ఎందుకు మెత్తగానే ఉంటాయి.? ఈ చిన్న చిట్కాలే రహస్యం.!
-
Dhanteras Story : అమృత కలశంతో సముద్రం నుంచి ధన్వంతరి.. ధన్తేరస్ వెనుక అసలు కథ ఇదే!
-
100W ఛార్జింగ్, 50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లేతో Poco X8s గ్లోబల్ లాంచ్..!