Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ ‘‘భారత క్రికెట్ నిధి’’.. మాజీ స్టార్ ప్రశంసలు..

  • వైభవ్ సూర్యవంశీ బాలమేధావి, భారత క్రికెట్ నిధి..
  • సచిన్, కోహ్లీ రికార్డుల్ని బద్ధలు కొడుతాడు..
  • మాజీ స్టార్ బౌలర్ డేల్ స్టెయిన్ ప్రశంసలు..
Vaibhav Sooryavanshi All

Vaibhav Sooryavanshi All

Vaibhav Sooryavanshi: దక్షిణాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ భారత సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీపై ప్రశంసలు కురిపించారు. ఆ కుర్రాడికి అపారమైన ప్రతిభ ఉందని, అతడిని సరిగా నడిపిస్తే భారత దిగ్గజాలైన సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ వంటి వారి కన్నా గొప్ప విజయాలు సాధించగలడని స్టెయిన్ అభిప్రాయపడ్డారు. ఐపీఎల్‌లో పరుగుల సునామీ సృష్టించిన సూర్యవంశీపై క్రికెట్ లెజెండ్స్ ప్రశంసలు గుప్పిస్తున్నారు.

స్టెయిన్ చేసిన ఈ వ్యాఖ్యలు వైభవ్ టాలెంట్ ఏంటో తెలియజేస్తున్నాయి. వైభవ్ సరైన దిశలో పయనించి, మానసికంగా స్థిరంగా ఉంటే భవిష్యత్తులో భారత దిగ్గజాల కన్నా గొప్ప విజయాలు సాధిస్తారని అన్నారు. ఐపీఎల్‌లో వైభవ్ సాధించిన 776 పరుగులు, కేవలం గణాంకాలు మాత్రమే కాదని, అతడికి అసాధారణ ప్రతిభ, సామర్థ్యం ఉన్నట్లు తెలియజేస్తున్నాయని కొనియాడాడు. సూర్యవంశీ ‘‘బాల మేధావి’’, ‘‘భారత క్రికెట్ నిధి’’అని అభివర్ణించారు.

×
×
Ad

అనేక రకాల బౌలింగ్ ఎదుర్కోగల సామర్థ్యం వైభవ్ సూర్యవంశీలో ఉందని, ఇదే అతడికి పెద్ద బలం అని, ఫాస్ట్ బాలైనా, స్పిన్ బౌలింగ్ అయినా, చిన్న మైదానాలైనా, ఫ్లాట్ పిచ్‌లు అయినా దానికి అనుగుణంగా ఆడే సామర్థ్యం అతడి సొంతమని చెప్పారు. ఇదే సమయంలో త్వరగా వచ్చే పేరు కూడా అంతే ప్రమాదకరమని హెచ్చరించాడు. క్రికెట్ నైపున్యమే కాకుండా, మానసిక ఒత్తిడి కూడా కీలక సాధనమని స్టెయిన్ అన్నారు.