Vaibhav Suryavanshi: ఇది బ్యాటింగా లేక విధ్వంసమా? 392 స్ట్రైక్ రేట్‌తో రికార్డులను తుడిచిపెట్టిన వైభవ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaibhav Suryavanshi: వన్డే మ్యాచ్‌లో 250 పరుగుల లక్ష్యమంటే ఏ జట్టుకైనా కాస్త పోరాటం తప్పదు. కానీ, ఒకే ఒక్క కుర్రాడు క్రీజులో పాతుకుపోయి ఆ మొత్తం టార్గెట్‌ను తన భుజాలపై వేసుకుని చిత్తు చేస్తే ఎలా ఉంటుంది? ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నీలో యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో అచ్చం అలాంటి అద్భుతమే జరిగింది. టీమిండియా యువ సంచలనం, కేవలం 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. యూఏఈ బౌలర్లకు కనీసం కోలుకునే అవకాశం కూడా ఇవ్వకుండా 52 బంతుల్లోనే అజేయంగా 204 పరుగులు బాది, 250 పరుగుల లక్ష్యాన్ని ఒక్కడే ఊదేశాడు.
సెమీఫైనల్ బెర్తును ఖాయం చేసుకునేందుకు 250 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా-ఏ జట్టుకు వైభవ్ కళ్లు చెదిరే ఆరంభాన్ని ఇచ్చాడు. క్రీజులోకి వచ్చిన క్షణం నుంచే బంతిని బౌండరీ దాటించడమే పనిగా పెట్టుకున్న ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఆ తర్వాత మరింత ఉగ్రరూపం దాల్చి 28 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకున్నాడు. వైభవ్ బాదుడు ఏ స్థాయిలో సాగిందంటే.. ఇన్నింగ్స్ 7 ఓవర్లు ముగిసేసరికే భారత్ 2 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. ఆ తర్వాత కూడా రింకూ సింగ్‌తో కలిసి విధ్వంసాన్ని కొనసాగించిన వైభవ్, మొత్తం 28 భారీ సిక్సర్లు, 7 ఫోర్లతో 392.30 స్ట్రైక్ రేట్‌తో డబుల్ సెంచరీ పూర్తి చేసి జట్టుకు విజయాన్ని మరింత దగ్గర చేశాడు.
Also Read
- టీ20ల్లో చరిత్ర సృష్టించిన Priyansh Arya.. 68 బంతుల్లో 181 పరుగులు..! క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు..
- Australia Cricket: మరో బాల్ ట్యాంపరింగ్ ప్లాన్?.. వెలుగులోకి సంచలన విషయాలు!
- IPL 2027-MI: ముంబై ఇండియన్స్ వైస్ కెప్టెన్‌గా తిలక్ వర్మ.. కెప్టెన్ ఎవరంటే?
- IND vs NZ 2nd Test: న్యూజిలాండ్‌కు భారీ షాక్.. రెండో టెస్టుకు స్టార్ పేసర్ దూరం!
ఈ సునామీ ఇన్నింగ్స్‌తో లిస్ట్-ఏ క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా వైభవ్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియా బ్యాటర్ జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్ (29 బంతులు – 2023), సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ (31 బంతులు – 2015) రికార్డులను 15 ఏళ్ల వయసులోనే వైభవ్ తుడిచిపెట్టేశాడు. వీరి తర్వాత నాలుగో స్థానంలో సకిబుల్ గని (32 బంతులు – 2025) ఉన్నాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ జట్టు 50 ఓవర్లలో 8 వికెట్లకు 249 పరుగులు చేసింది. ఆ జట్టులో హర్‌ప్రీత్ సింగ్ భాటియా (144 బంతుల్లో 130) ఎంతో శ్రమించి సెంచరీ సాధించగా, భారత బౌలర్ అర్షద్ ఖాన్ 4 వికెట్లతో రాణించాడు. యూఏఈ జట్టు మొత్తం 50 ఓవర్లు కష్టపడి చేసిన స్కోరును, వైభవ్ ఒక్కడే కేవలం 52 బంతుల్లో కరిగించేయడం ఇప్పుడు క్రీడా ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది.
తాజావార్తలు
-
Vaibhav Suryavanshi: ఇది బ్యాటింగా లేక విధ్వంసమా? 392 స్ట్రైక్ రేట్‌తో రికార్డులను తుడిచిపెట్టిన వైభవ్!
-
Rahul Gandhi: “నాన్నను చంపడానికే భద్రతను తొలగించారు”: రాజీవ్ గాంధీ హత్యపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణ!
-
Bandla Ganesh: ‘ఇగో, మధ్యవర్తుల వల్లే ఆ కేసు’.. సమసిపోయిన బండ్ల గణేష్ చెక్ బౌన్స్ వివాదం
-
Jagapathi Babu: హద్దులు చెరిగిపోతున్నాయి.. ఇదే బెస్ట్
-
Vetrimaaran: 23 ఏళ్ల క్రితం రాసిన కథతోనే ఇన్ని హిట్లు కొట్టాడా? వెట్రిమారన్ షాకింగ్ స్టేట్మెంట్!
ట్రెండింగ్
-
6.58mm స్లిమ్ డిజైన్, 50MP కెమెరా, 6500mAh బ్యాటరీతో Huawei Mate 90 Air లాంచ్..!
-
2TB స్టోరేజ్, 8000 నిట్స్ బ్రైట్నెస్, 6200mAh బ్యాటరీతో Huawei Mate X8 లాంచ్..!
-
టీ20ల్లో చరిత్ర సృష్టించిన Priyansh Arya.. 68 బంతుల్లో 181 పరుగులు..! క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు..
-
రూ.83 వేల ప్రారంభ ధరతో ఐదు వేరియంట్లతో లాంచ్.. Suzuki Access 125 స్కూటర్లో కొత్త కలర్స్..!
-
501.7cc ఇంజిన్, మూడు వేరియంట్లు.. రెట్రో లుక్‌తో Honda CB500 బైక్..!