Vaibhav Sooryavanshi: నేను ఏ బౌలర్‌కు భయపడను.. వారే నన్ను చూసి వణికిపోతున్నారు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaibhav Sooryavanshi Fearless Reply Goes Viral: ఐపీఎల్ 2026 సీజన్లో భారత క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ అసాధారణ బ్యాటింగ్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. 16 మ్యాచ్‌ల్లో 776 పరుగులు చేసి ‘ఆరెంజ్ క్యాప్’ను సొంతం చేసుకున్నాడు. విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ వంటి స్టార్ బ్యాటర్లను వెనక్కి నెట్టి అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచాడు. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా, పాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్ వంటి ప్రపంచ స్థాయి బౌలర్లను కూడా ధైర్యంగా ఎదుర్కొని.. భారీ షాట్లు ఆడటం అతడి ప్రత్యేకతగా నిలిచింది. ఈ ప్రదర్శనతో బుడ్డోడు ఏకంగా టీమిండియాలోనే చోటు దక్కించుకున్నాడు.
ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ:
ఇంగ్లండ్ పర్యటనలో అరంగేట్రం చేసిన వైభవ్ సూర్యవంశీ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. మూడు మ్యాచ్‌లలో విఫలమవడంతో చివరి టీ20లో జట్టులో చోటు కోల్పోయాడు. అనంతరం జరిగిన జింబాబ్వే టీ20 సిరీస్‌లో రెచ్చిపోయాడు. మొదటి టీ20లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ (18 బంతుల్లో 50), రెండో టీ20లో మెరుపు ఇన్నింగ్స్ (9 బంతుల్లో 20), మూడో టీ20లో తుఫాన్ ఇన్నింగ్స్ (49 బంతుల్లో 81 పరుగులు) ఆడాడు. మూడు మ్యాచ్‌లలో 151 రన్స్ చేశాడు. బుడ్డోడి అద్భుత బ్యాటింగ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డుతో పాటు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డును కూడా దక్కింది.
Also Read
- India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
- India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
- Virat Kohli 100 Centuries: 100 సెంచరీలు కొట్టలేడు..! కోహ్లీపై టీమిండియా మాజీ స్టార్ ఆసక్తికర కామెంట్స్
- Abhishek Sharma: పాకిస్థాన్‌కు అసలైన మొగుడు కాటేరమ్మకొడుకే.. పాక్‌పై అభిషేక్ శర్మ విధ్వంసం..!
ఏ బౌలర్‌కు భయపడలేదు:
తాజాగా రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) షేర్ చేసిన ఓ వీడియోలో వైభవ్ సూర్యవంశీ ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆర్ఆర్ సరదా నిర్వహించిన ఇంటర్వ్యూలో ‘ఏ బౌలర్‌ను ఎదుర్కోవడానికి భయపడతావు?’ అని వైభవ్‌ను ప్రశ్నించారు. దీనికి అతడు ఏమాత్రం ఆలోచించకుండా ‘ఇప్పటివరకు ఏ బౌలర్‌కు భయపడలేదు’ అంటూ ధైర్యంగా సమాధానం ఇచ్చాడు. ఈ సమాధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సమాధానం అతని ధైర్యం, ఆత్మవిశ్వాసానికి నిదర్శనంగా నిలిచింది. చిన్న వయసులోనే అతడి ఆత్మవిశ్వాసాన్ని చూసి క్రికెట్ అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
జట్టుకు వైస్ కెప్టెన్‌గా వైభవ్:
వైభవ్‌కు మరో పెద్ద గౌరవం దక్కింది. వచ్చే నెల ప్రారంభమయ్యే దులీప్ ట్రోఫీ కోసం ఇషాన్ కిషన్ సారథ్యంలోని ఈస్ట్ జోన్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. రెడ్ బాల్ జోనల్ టోర్నీలో తొలి అవకాశంలోనే ఉప కెప్టెన్ బాధ్యతలు దక్కడం అతడిపై సెలెక్టర్లకు ఉన్న నమ్మకాన్ని చాటుతోంది. అన్ని ఫార్మాట్లలో భారత భవిష్యత్ స్టార్‌గా అతడిని తీర్చిదిద్దే ప్రయత్నంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు. ఈస్ట్ జోన్ జట్టులో బిహార్ నుంచి ఎంపికైన ఏకైక ఆటగాడు కూడా సూర్యవంశీనే. ఈ జట్టులో మహ్మద్ షమీ, ముకేశ్ కుమార్, షాబాజ్ అహ్మద్, అభిమన్యు ఈశ్వరన్ వంటి సీనియర్లు కూడా ఉన్నారు. ఆగస్టు 23 నుంచి సెప్టెంబర్ 6 వరకు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో దులీప్ ట్రోఫీ జరగనుంది.
తాజావార్తలు
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!