Vaibhav Sooryavanshi Jersey: వైభవ్ సూర్యవంశీ చేతికి టీమిండియా జెర్సీ.. బుడ్డోడికి దిగ్గజాల జెర్సీ నంబర్!
- వైభవ్ సూర్యవంశీ చేతికి టీమిండియా జెర్సీ
- భావోద్వేగంకు గురైన యూనివర్స్ బేబీ బాస్
- బుడ్డోడికి దిగ్గజాల జెర్సీ నంబర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaibhav Sooryavanshi Gets Team India Jersey: భారత క్రికెట్లో సరికొత్త సంచలనంగా మారిన వైభవ్ సూర్యవంశీ.. మరో అరుదైన ఘట్టాన్ని తన కెరీర్లో నమోదు చేసుకున్నాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే భారత సీనియర్ టీ20 జట్టులో చోటు దక్కించుకున్న యూనివర్స్ బేబీ బాస్.. తొలి టీమిండియా జెర్సీని అందుకున్నాడు. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల కోసం ఎంపికైన వైభవ్ చేతికి మంగళవారం భారత జట్టు జెర్సీ అందింది. ఈ అద్భుత క్షణం అతని జీవితంలో మరిచిపోలేని అనుభూతిగా నిలిచింది. ఈ భావోద్వేగ క్షణానికి సంబంధించిన వీడియోను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తన సోషల్ మీడియాలో పంచుకుంది.
త్రోడౌన్ స్పెషలిస్ట్ చేతుల మీదుగా జెర్సీ:
భారత జట్టు త్రోడౌన్ స్పెషలిస్ట్ రఘు చేతుల మీదుగా వైభవ్ సూర్యవంశీ తన తొలి టీమిండియా జెర్సీని అందుకున్నాడు. జెర్సీని చూసిన క్షణంలోనే అతని ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. ఈ సందర్భంగా మాట్లాడిన వైభవ్.. ‘నేను మొదటిసారి బ్యాట్ పట్టుకుని క్రికెట్ మైదానానికి వెళ్లిన రోజు నుంచి భారత జట్టుకు ఆడాలనే కల కనేవాడిని. ఈరోజు ఆ కల నెరవేరింది. నా ప్రయాణంలో ఇదే అతిపెద్ద అడుగు. ఈ అనుభూతిని మాటల్లో చెప్పలేను. ఆ జెర్సీని చూసిన క్షణం నుంచి నా ముఖంలో చిరునవ్వు ఆగలేదు. చాలా సంతోషంగా ఉంది. ఇక జట్టులో ఆడడం కోసం ఆతృతగా ఉన్నా’ అని తెలిపాడు.
Also Read
- Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
- T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
- Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
- Tilak Varma Run Out: తిలక్ వర్మ నిర్లక్ష్యం.. ఊహించని రీతిలో రనౌట్.. అసలేం జరిగిందంటే?
ఎలా స్పందించాలో తెలియదు:
తన హోటల్ గదిలోకి టీమిండియా జెర్సీ వచ్చినప్పుడు ఎలా స్పందించాలో కూడా అర్థం కాలేదని వైభవ్ సూర్యవంశీ చెప్పాడు. ‘జీవితంలో ఎప్పుడూ ఊహించని విషయం ఒక్కసారిగా నిజమైతే ఎలా స్పందించాలో తెలియదు. నాకు కూడా అదే అనిపించింది. ఆ క్షణాన్ని ఆస్వాదించడం తప్ప మరేం చేయలేకపోయాను’ అంటూ తన భావోద్వేగాన్ని వ్యక్తం చేశాడు. టీమిండియా జట్టులో చోటు దక్కినా.. తుది జట్టులో స్థానం సంపాదించడం వైభవ్‌కు అంత సులభం కాదు. ఓపెనర్ స్థానాల కోసం సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ వంటి సీనియర్ ఆటగాళ్లతో పోటీ పడాల్సి ఉంటుంది. అయినప్పటికీ ఇటీవల ఐపీఎల్లో అద్భుత ప్రదర్శనలతో అందరి దృష్టిని ఆకర్షించిన వైభవ్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.
నంబర్-3 జెర్సీ:
ఆసక్తికర విషయం ఏమిటంటే.. యూనివర్స్ బేబీ బాస్ వైభవ్‌కు భారత జట్టులో నంబర్-3 జెర్సీ కేటాయించారు. గతంలో ఈ నంబర్ జెర్సీని భారత క్రికెట్ దిగ్గజాలు హర్భజన్ సింగ్, సురేశ్ రైనా ధరించారు. ఇప్పుడు అదే జెర్సీతో వైభవ్ అంతర్జాతీయ క్రికెట్లో తన కొత్త ప్రయాణాన్ని ప్రారంభించనున్నాడు. భారత క్రికెట్ భవిష్యత్తుగా భావిస్తున్న ఈ యువ ఆటగాడు తన తొలి అవకాశాన్ని ఎలా వినియోగించుకుంటాడో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 15 ఏళ్ల ప్రాయంలోనే బుడ్డోడు అధికారికంగా ఇండియన్ క్రికెట్ జెర్సీని అందుకుని సరికొత్త చరిత్ర సృష్టించాడు.
Ladies & Gentlemen
The moment the nation has been waiting for has arrived!
Vaibhav Sooryavanshi in #TeamIndia jersey. Witness this incredibly special moment ❤️ pic.twitter.com/sUUytFMPVw
— BCCI (@BCCI) June 23, 2026
తాజావార్తలు
-
El Nino: ఎల్‌నినోతో భూమికి భారీ ముప్పు.. బద్దలుకానున్న రికార్డులు!
-
AA 23 Update: రూమర్లకు ఒకే ఫోటోతో చెక్.. ‘AA 23’పై లోకేష్ కనగరాజ్ క్లారిటీ చూశారా!
-
Harish Rao : ఎల్ నినో పేరుతో ప్రభుత్వం కాలక్షేపం చేస్తోంది
-
Navratri 2026: నవరాత్రుల్లో డిజిటల్ ఫాస్టింగ్ అంటే ఏమిటి? మొబైల్‌కు దూరంగా ఉంటే ఆరోగ్యానికి ప్రయోజనాలివే
-
Kerala Assembly: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తొలగింపునకు కేరళ అసెంబ్లీ తీర్మానం.. అసలు కారణాలివే
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!