Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అరుదైన గౌరవం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీకి అరుదైన గుర్తింపు లభించింది. ప్రతిష్ఠాత్మక ‘TIME 100 Next India’ తొలి జాబితాలో బుడ్డోడికి చోటు దక్కింది. దేశ భవిష్యత్తును ప్రభావితం చేస్తున్న 100 మంది అసాధారణ నాయకులు, ఎదుగుతున్న ప్రతిభావంతులను గుర్తిస్తూ ఈ జాబితాను రూపొందించారు. ఈ సందర్భంగా బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా.. వైభవ్‌పై ప్రత్యేకంగా ప్రశంసలు కురిపిస్తూ భావోద్వేగభరితమైన సందేశాన్ని రాశారు. మైదానంలో వైభవ్ తన బ్యాట్‌తో చెలరేగుతున్నపుడు.. భవిష్యత్తు అనేది భిన్నంగా ఆలోచించే వారిదేనని గుర్తుచేస్తాడని పేర్కొన్నారు.
వైభవ్ కేవలం క్రీడా రంగంలో అద్భుత ప్రతిభ కలిగిన యువ ఆటగాడే కాదని, అంతకుమించిన ప్రాధాన్యం ఉన్న వ్యక్తి అని ఆయుష్మాన్ ఖురానా కొనియాడారు. అతడు మారుతున్న భారతదేశానికి ప్రతీకగా నిలుస్తున్నాడన్నారు. 14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడిగా వైభవ్ గుర్తింపు పొందాడని గుర్తుచేశారు. ఆ తర్వాత ఏడాది కాలంలోనే 2026లో రికార్డులు సృష్టించిన మ్యాచ్‌ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించే స్థాయికి ఎదిగాడని ప్రశంసించారు. అతడి వేగవంతమైన ప్రయాణం.. ప్రతిభ ఎక్కడి నుంచైనా వెలుగులోకి రావచ్చని నిరూపిస్తోందని పేర్కొన్నారు.
Also Read
- Ravindra Jadeja: జడేజాను పక్కన పెట్టడానికి అసలు కారణం ఇదే.. కోచ్ క్లారిటీ!
- Jasprit Bumrah Record: టెస్టుల్లో మరో అరుదైన ఘనత.. టాప్-10లోకి జస్ప్రీత్ బుమ్రా!
- NZ vs IND 1st Test: నికోల్స్ సెంచరీ, ఫిలిప్స్ విధ్వంసం.. 70కే 5 వికెట్స్ కోల్పోయినా కివీస్‌దే పైచేయి!
- World Cup Final 2023: నవంబర్ 19.. భారత క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేని చేదు జ్ఞాపకం..
వైభవ్ సాధించిన పరుగులు, రికార్డులకే అతడి విజయాన్ని పరిమితం చేయలేమని ఆయుష్మాన్ అభిప్రాయపడ్డారు. అతడి ప్రయాణం, విజయాలు లక్షలాది మంది యువ భారతీయులకు పెద్ద కలలు కనడానికి స్ఫూర్తినిస్తాయన్నారు. కోట్లాది మంది కలలకు తమ ప్రతిభను నిరూపించుకునే స్వేచ్ఛ తోడైతే ఎలాంటి అద్భుతాలు సాధ్యమవుతాయో కాలమే సమాధానం చెబుతుందని వ్యాఖ్యానించారు. అయితే వైభవ్ తన బ్యాట్‌తోనే ఇప్పటికే ఆ ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాడని, అతడి ఆటతీరు, ఆత్మవిశ్వాసం ప్రత్యేకమని కొనియాడారు.
ఆయుష్మాన్ ఖురానా గతంలో TIME100 జాబితాలో చోటు దక్కించుకోవడంతో పాటు TIME Impact Award కూడా అందుకున్నారు. అలాంటి వ్యక్తి నుంచి వైభవ్‌కు ప్రశంసలు లభించడం యువ క్రికెటర్‌కు మరింత ప్రత్యేక గుర్తింపుగా నిలిచింది. వైభవ్‌తో పాటు భారత మహిళల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్, వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను, చెస్ ప్రపంచ ఛాంపియన్ డి. గుకేశ్, మాజీ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, భారత మహిళల హాకీ జట్టు గోల్‌కీపర్ సవితా పూనియా కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలు సాధించిన విథ్యా రామరాజ్, కూకుమ్ మొహోద్లకు కూడా ఈ జాబితాలో స్థానం లభించింది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అరుదైన గౌరవం!
-
Dawood Ibrahim: పాకిస్థాన్‌లో దావూద్ ఇంకా ఫుల్ యాక్టివ్.. మాజీ ఎఫ్‌బీఐ ఏజెంట్ బయటపెట్టిన సంచలన నిజాలు
-
Itel City 300 5G: కొత్త కలర్ వేరియంట్లలో itel City 300 5G లాంచ్.. 13MP కెమెరా, 5000mAh బ్యాటరీ!
-
Aditya Dhar: రణ్వీర్ సింగ్‌తోనే ఆదిత్య ధర్ మూవీ.. ఈసారి మరో డ్రీమ్ ప్రాజెక్ట్!
-
CM Revanth Reddy: క్యూర్, ప్యూర్, రేర్.. తెలంగాణ సమగ్రాభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి మూడు రీజియన్ల ఫార్ములా..
ట్రెండింగ్
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!