Vaibhav Sooryavanshi Century: వరల్డ్‌కప్ ఫైనల్లో సెంచరీలు.. చరిత్రలో నిలిచిపోయిన ఇన్నింగ్స్‌లు ఇవే!
- రెచ్చిపోయిన టీమిండియా యువ సంచలనం వైభవ్
- ఇంగ్లాండ్‌పై 55 బంతుల్లో సెంచరీ
- వరల్డ్‌కప్ ఫైనల్లో సెంచరీ ఇన్నింగ్స్‌లు ఇవే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaibhav Sooryavanshi Century: అండర్-19 వరల్డ్‌కప్ ఫైనల్ అంటేనే తీవ్ర ఒత్తిడి ఉంటుంది. అలాంటి మ్యాచ్‌లో సెంచరీ చేయడం అంటే సాధారణ విషయం కాదు. కానీ కొందరు యువ క్రికెటర్లు ఆ ఒత్తిడిని లెక్కచేయకుండా.. శతకాలు బాది చరిత్ర సృష్టించారు. ఈ జాబితాలో టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కూడా ఉన్నాడు. 2026 అండర్-19 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో 55 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా అండర్-19 వరల్డ్‌కప్ ఫైనల్స్‌లో నమోదైన శతకాలు లిస్ట్ ఓసారి చూద్దాం.
హరారే వేదికగా జరుగుతున్న 2026 అండర్-19 వరల్డ్‌కప్ ఫైనల్‌లో వైభవ్ సూర్యవంశీ ఇంగ్లాండ్‌పై అజేయంగా 175 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఒత్తిడిలోనూ అద్భుతంగా ఆడుతూ పరుగుల వరద పారించాడు. వైభవ్ దంచుడుకు ఇంగ్లాండ్ బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. వైభవ్ ఆట భారత అండర్-19 క్రికెట్ చరిత్రలో స్వర్ణ అధ్యాయంగా నిలిచింది. టౌన్స్‌విల్లే వేదికగా 2012 ఫైనల్‌లో ఉన్ముక్త్ చంద్ ఆస్ట్రేలియాపై సెంచరీ (111 నాటౌట్) చేసి భారత జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఫైనల్ మ్యాచ్‌లో కెప్టెన్‌గా, బ్యాట్స్‌మన్‌గా అతడి ఇన్నింగ్స్ ఇప్పటికీ అభిమానుల మదిలో అలానే ఉంది.
Also Read
- ICC Rankings: ఒక్క సెంచరీతో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్.. తగ్గిన విరాట్ కోహ్లీ ర్యాంక్..
- BCCI: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఇకపై ప్రతి మీటింగ్‌లో హైదరాబాద్ ఆటగాడు!
- Virat Kohli: కోహ్లీపై రూ.5 కోట్ల ఆరోపణలు.. స్పందించిన విరాట్ టీమ్.. అసలు ఏం జరిగిందంటే..?
- Naman Dhir: ముంబై ఇండియన్స్ అద్భుతం.. ఆ రూల్ వల్లే బౌలింగ్ చేయడం లేదు!
అండర్-19 ఫైనల్స్‌లో ఆస్ట్రేలియా ఆటగాళ్లకూ ప్రత్యేక స్థానం ఉంది. 1988 ఫైనల్‌లో బ్రెట్ విలియమ్స్ పాకిస్థాన్‌పై 108 పరుగులు చేసి తన పేరు చరిత్రలో లిఖించుకున్నాడు. అలాగే 2002 ఫైనల్‌లో జారెడ్ బర్క్ దక్షిణాఫ్రికాపై అజేయ శతకం (100 నాటౌట్) సాధించి ఆస్ట్రేలియా విజయానికి బాటలు వేశాడు. ఇంగ్లాండ్ తరఫున 1998 ఫైనల్‌లో స్టీఫెన్ పీటర్స్ న్యూజిలాండ్‌పై 107 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. భారత తరఫున మరో చిరస్మరణీయ ప్రదర్శనగా 2018 ఫైనల్ నిలిచింది. మంజోత్ కల్రా ఆస్ట్రేలియాపై (101 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్ ఆడి భారత విజయాన్ని ఖాయం చేశాడు. మొత్తంగా చూస్తే.. అండర్-19 వరల్డ్‌కప్ ఫైనల్స్‌లో వచ్చిన ఈ శతకాలు కేవలం గణాంకాలు మాత్రమే కాదు.. భవిష్యత్తు క్రికెట్‌ను మార్చిన ఇన్నింగ్స్‌లు, ప్రపంచ క్రికెట్‌కు కొత్త ఆటగాళ్లను పరిచయం చేసిన చారిత్రక క్షణాలు.
తాజావార్తలు
-
ICC Rankings: ఒక్క సెంచరీతో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్.. తగ్గిన విరాట్ కోహ్లీ ర్యాంక్..
-
Mythri Ravi: “రూ. 2 కోట్లతో తీస్తే రూ. 400 కోట్లా? మాకు ఇది చెంపపెట్టు”
-
Pre-Launch Scam: తెల్లాపూర్‌లో తక్కువ ధరకే ఫ్లాట్లు అని ఎర.. నిలువునా ముంచిన బిల్డర్
-
Bhutan PM: మోడీ ‘విష్ణువు అవతారం’.. 25 ఏళ్ల పాలనపై భూటాన్ ప్రధాని ప్రశంసలు
-
Sivakarthikeyan: ఫ్యాన్స్‌కు శివకార్తికేయన్ ఇచ్చిన ఆ ఒక్క సలహా.. నెట్టింట వీడియో వైరల్!
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!