అండర్ 19 ఆసియా కప్ 2025 ఫైనల్‌కు యువ భారత్ దూసుకెళ్లింది. దుబాయ్ వేదికగా శ్రీలంకతో జరిగిన సెమీస్-1లో భారత్ 8 వికెట్ల తేడాతో గెలిచింది. లంక నిర్ధేశించిన 139 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 18 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత బ్యాటర్లు విహాన్ మల్హోత్రా (61 నాటౌట్; 45 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులు), ఆరోన్ జార్జ్ (58 నాటౌట్, 49 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీలు చేశారు. సెమీస్-2లో బంగ్లాదేశ్‌పై పాకిస్తాన్ గెలిచింది. ఇక డిసెంబర్ 21న దుబాయ్ వేదికగా దాయాదులు భారత్, పాకిస్తాన్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
U19 Asia Cup 2025 Final: అండర్ 19 ఆసియా కప్ ఫైనల్‌కు భారత్.. పాకిస్తాన్‌తో తుది పోరు!
- అండర్ 19 ఆసియా కప్ ఫైనల్‌కు భారత్
- సెమీస్-1లో 8 వికెట్ల తేడాతో విజయం
- పాకిస్తాన్‌తో భారత్ తుది పోరు

IND vs PAK Final