ZIM vs IND 4th T20I: జింబాబ్వే పర్యటనలో ఉన్న యువ భారత జట్టు అంచనాలకు అనుగుణంగానే ఆడుతుంది. తక్కువ స్కోర్ల తొలి టీ20లో తడబడి ఓటమి పాలైనా.. ఆ తర్వాతి రెండు టీ20 మ్యాచ్‌లలో జట్టు సంపూర్ణ ఆధిపత్యాన్ని కనబరిచింది. భారీ స్కోర్ చేసిన తర్వాత లక్ష్యన్ని కాపాడుకుంది. ఇదే జోరులో మరో మ్యాచ్‌లో గెలిచి.. సిరీస్ సొంతం చేసుకోవాలని టీమిండియా నయా కెప్టెన్ శుభ్ మన్ గిల్ టీమ్ పట్టుదలగా ఉంది. టీమిండియా ప్లేయర్స్ అందరు ఫామ్‌లో ఉండటం సానుకూలాంశంగా మారింది. ఇక, రుతురాజ్ గైక్వాడ్ నిలకడగా ఆడుతుండగా.. అభిషేక్ శర్మ దూకుడైన బ్యాటింగ్ తో రెండో మ్యాచ్‌లో శతకంతో కదం తొక్కాడు.. కెప్టెన్ గిల్ కూడా హాఫ్ సెంచరీతో ఫామ్‌లోకి రాగా.. వరల్డ్ కప్ నుంచి తిరిగొచ్చిన తర్వాత యశస్వి జైస్వాల్ కూడా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే, రింకూ సింగ్ కూడా రెండో టి20లో సిక్సర్ల మోత మోగించాడు.. గత మ్యాచ్‌లో ఎక్కువ బంతులు ఆడే ఛాన్స్ రాని సంజూ శామ్సన్ కూడా రెచ్చిపోయి బ్యాటింగ్ చేశాడు.
Read Also: UP Weather : భారీ వర్షాల కారణంగా నేపాల్ నుంచి నీటి విడుదల.. మునిగిపోయిన 800గ్రామాలు
కాగా, శివమ్ దూబే కూడా తన దూకుడును ప్రదర్శిస్తే ఇక ఈ బ్యాటింగ్ లైనప్‌ను నిలువరించడం జింబాబ్వే బౌలర్లకు అంత ఈజీ కాదు.. అలాగే, బౌలింగ్‌లో వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్ స్పిన్ తో ప్రత్యర్థి బ్యాటర్లు ముప్పతిప్పలు పెడుతున్నారు. తొలి మూడు మ్యాచ్‌లు ఆడిన అవేశ్ ఖాన్ స్థానంలో ముకేశ్ కుమార్ కు మళ్లీ తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. ఈ మార్పు మినహా అదే జట్టు కొనసాగే ఛాన్స్ ఉంది. మరోవైపు సిరీస్‌ను కోల్పోకుండా ఉండేందుకు జింబాబ్వే రెట్టింపు శ్రమించాల్సిన అవసరం ఉంది.
Read Also: Mamata Banerjee: నరేంద్ర మోడీ సర్కార్ ఐదేళ్ల పాటు కొనసాగడం కష్టమే..?
అయితే, జింబాబ్వే జట్టు గత రెండు మ్యాచ్‌లలో పేలవ ఫీల్డింగ్‌తో 7 క్యాచ్‌లు వదిలేయడంతో పాటు అదనపు రన్స్ బాగా ఇచ్చింది. దీనిని నివారించగలిగితే టీమ్ భారత జట్టుకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. మరోసారి కెప్టెన్ సికందర్ రజానే ఈ మ్యాచ్ లో కీలకం కానున్నారు. బెన్నెట్, మైర్స్, క్యాంప్‌బెల్‌లపై బ్యాటింగ్ భారం పడనుంది. బౌలింగ్‌లో పేసర్ ముజరబాని, చటారా నిలకడగా రాణిస్తున్నారు. సొంతగడ్డపై జింబాబ్వే తమ స్థాయికి తగినట్లు ఆడితే మ్యాచ్ మరింత ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది.