మన బోణీ అదిరేనా? నేడే అప్ఘనిస్తాన్‌తో భారత్ ఢీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీ20 ప్రపంచకప్‌లో తొలి విజయం కోసం టీమిండియా ఆరాటపడుతోంది. ఇప్పటికే పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లపై పరాజయం ఎదురు కావడంతో భారత ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం తీవ్రంగా దెబ్బతింది. ఈ నేపథ్యంలో బుధవారం పసికూన అప్ఘనిస్తాన్‌తో కోహ్లీ సేన తలపడనుంది. అబుదాబీ వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే టీమిండియా ఈ మ్యాచ్‌లో భారీ విజయం సాధించాలి. అయితే అఫ్ఘనిస్తాన్ జట్టును మనోళ్లు అంత లైట్ తీసుకోకూడదు. ఎందుకంటే ఆ జట్టు ఎప్పుడైనా షాక్ ఇవ్వగలదు.
Read Also: ఆ ఓటమే ఇండియాను దెబ్బతీసింది : గవాస్కర్
Also Read
- Team India: రోహిత్ శర్మపై వేటు.. జట్టులోకి యువరాజ్ సింగ్, సచిన్..
- FIFA WC 2026: 39 ఏళ్ల మెస్సీని ఇప్పటికీ ఎందుకు ఎవరూ ఆపలేకపోతున్నారు? కారణం ఇదే!
- Lionel Messi: 39 ఏళ్ల మెస్సీ.. మరో చరిత్రకు అడుగు దూరంలో.. గోల్డెన్ బూట్ గెలుస్తాడా?
- IND vs ENG 2nd ODI: వన్డే సిరీస్‌పై కన్నేసిన టీమిండియా.. నేడు రెండో వన్డే.! పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ XI, మ్యాచ్ వివరాలు ఇవే..!
మరోవైపు జట్టు కూర్పు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి అతిపెద్ద సమస్యగా మారింది. టీమ్‌లో సీనియర్ స్పిన్నర్ అశ్విన్ ఉన్నా ఎందుకో అతడిని తుదిజట్టులో ఆడించడంలేదు. ఇప్పుడిప్పుడే ఓనమాలు నేర్చుకుంటున్న వరుణ్ చక్రవర్తిపై టీమ్ మేనేజ్‌మెంట్ అతి విశ్వాసం చూపిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆ అతి విశ్వాసమే తొలి రెండు మ్యాచ్‌ల్లో దెబ్బ తీసిందనేది విశ్లేషకుల మాట. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో రోహిత్‌ను ఓపెనర్‌గా పంపకపోవడంపైనా విమర్శలు వచ్చాయి. ఈ మ్యాచ్‌తో టీమిండియా ఆటగాళ్ల ఫామ్‌లోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఒకవేళ భారత్ గెలిస్తే పెద్దగా సంబరాలు ఉండకపోవచ్చు కానీ ఈ మ్యాచ్‌లో ఓడితే మాత్రం కోహ్లీపై విమర్శల దాడి తప్పదు.
పిచ్ ఎలా ఉంటుంది?
టీ20 ప్రపంచకప్‌లో అబుదాబి పిచ్ మీద ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు జరగ్గా… అందులో ఆరు సార్లు ఛేజింగ్ టీమ్ గెలిచింది. ఇక్కడి పిచ్ ఫాస్ట్ బౌలర్లకు కొంత అనుకూలంగా ఉంటుందని క్యూరేటర్ వివరించాడు.
తాజావార్తలు
-
Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లు.. మిషన్ 360పై మోడీ సర్కార్ ఫోకస్..
-
Sujeeth: సైలెంట్‌గా పని కానిచ్చేస్తున్న స్టార్ డైరెక్టర్..
-
Supreme Court: 9వ తరగతిలో మూడో భాష రుద్దొద్దు.. కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
-
Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇస్తాం.. సంజయ్ రౌత్ యూటర్న్..
-
Governor Abdul Nazeer: డిప్యూటీ సీఎంను ఇంటికెళ్లి పరామర్శించిన గవర్నర్.. పవన్ కల్యాణ్ లైబ్రరీ సందర్శన..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్‌ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్‌లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!