Tilak Varma: అంత నిర్లక్షమా.. బీచ్‌లో వాకింగ్ చేస్తున్నావా ఏంటి?.. తెలుగు ఆటగాడిపై మాజీ క్రికెటర్ ఫైర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sadagoppan Ramesh Slams Tilak Varma Over Run-Out: వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో భారత యువ బ్యాటర్ తిలక్ వర్మ ఔటైన తీరు చర్చనీయాంశంగా మారింది. ఆటపై అవగాహన లేకపోవడంతోనే అతడు వికెట్ కోల్పోయాడని భారత మాజీ ఓపెనర్ సదగోప్పన్ రమేశ్ విమర్శించాడు. కీలక సమయంలో అప్రమత్తంగా ఉండాల్సిన తిలక్.. చుట్టూ ఏం జరుగుతుందో కూడా పట్టించుకోనట్లు వ్యవహరించాడని ఫైర్ అయ్యాడు. తిలక్ ఆట తీరును బీచ్‌లో వాకింగ్ చేస్తున్న వ్యక్తితో పోల్చాడు. అంత నిర్లక్ష్యం ఏంటి?, బీచ్‌లో వాకింగ్ చేస్తున్నావా ఏంటి? అంటూ రమేశ్ మండిపడ్డాడు.
ఆదివారం రాత్రి ఇండోర్ వేదికగా భారత్, వెస్టిండీస్ మధ్య మూడో టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత ఇన్నింగ్స్ 17వ ఓవర్లో తిలక్ వర్మ అనూహ్య రీతిలో అవుట్ అయ్యాడు. విండీస్ బౌలర్ గుడాకేశ్ మోటీ వేసిన బంతిని అక్షర్ పటేల్ స్క్వేర్ లెగ్ దిశగా ఫ్లిక్ చేశాడు. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న కమీల్ పూరన్ డైవ్ చేస్తూ బంతిని అడ్డుకున్నాడు. అయితే బంతి బౌండరీ రోప్‌ను తాకిందని అక్షర్ , తిలక్ వర్మ భావించారు. దీంతో పరుగులు పూర్తి చేయడంపై తిలక్ దృష్టి పెట్టలేదు. ఈ అవకాశాన్ని వెస్టిండీస్ ఫీల్డర్లు చక్కగా ఉపయోగించుకున్నారు. బంతి బౌండరీకి వెళ్లలేదని గుర్తించిన వారు వెంటనే స్పందించి రెండు వైపులా వికెట్లను పడగొట్టారు.
Also Read
అయితే అప్పటికే అక్షర్ పటేల్ స్ట్రైకర్ ఎండ్‌కు చేరుకోగలిగాడు. కానీ నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న తిలక్ వర్మ మాత్రం క్రీజులోకి చేరుకునే ప్రయత్నం చేయలేదు. బౌలర్ మోటీ వికెట్లపై ఉన్న బెయిల్స్‌ను పడగొట్టడంతో.. తిలక్ రనౌట్ అయ్యాడు. తిలక్ ఔటైనట్లు థర్డ్ అంపైర్ ప్రకటించాడు. ఈ ఘటనపై స్పందించిన సదగోప్పన్ రమేశ్.. ‘బౌండరీ వద్ద ఏం జరిగిందో అంపైర్లకే స్పష్టత లేక థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేశారు. అలాంటప్పుడు అంతే దూరంలో ఉన్న బ్యాటర్లు బంతి బౌండరీకి వెళ్లిందని ఎలా నిర్ణయించుకున్నారు. అక్షర్ పటేల్ తర్వాత పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. కానీ తిలక్ మాత్రం చుట్టూ ఏం జరుగుతుందో తెలియనట్లుగా వ్యవహరించాడు. అతడు బీచ్‌లో నడకకు వెళ్లినట్లుగా కనిపించాడు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎప్పుడైనా బ్యాటర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించాడు.
ఈ మ్యాచ్‌లో భారత్ 14 పరుగుల తేడాతో వెస్టిండీస్‌పై విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 30 బంతుల్లోనే 69 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరు అందించాడు. ఇషాన్ కిషన్ 18 బంతుల్లో 37 పరుగులు చేయగా, తిలక్ వర్మ 16 బంతుల్లో 28 పరుగులు చేశాడు. నితీశ్ కుమార్ రెడ్డి 21, అక్షర్ పటేల్ 20 పరుగులతో రాణించారు. 224 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 209 పరుగులకే పరిమితమైంది. షిమ్రోన్ హెట్మయర్ 43, కమీల్ పూరన్ 42 పరుగులతో పోరాడినా జట్టును గెలిపించలేకపోయారు. భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్ 44 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
తాజావార్తలు
-
Tilak Varma: అంత నిర్లక్షమా.. బీచ్‌లో వాకింగ్ చేస్తున్నావా ఏంటి?.. తెలుగు ఆటగాడిపై మాజీ క్రికెటర్ ఫైర్!
-
Papikondalu Boating: 70 రోజుల విరామం.. నేటి నుంచి పాపికొండలు విహారయాత్ర!
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే హఠాన్మరణం
-
AP Weather Update: ఏపీకి 4 రోజుల పాటు వర్ష సూచన!
ట్రెండింగ్
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!