Wrestlers Talks: రెజ్లర్లపై లైంగిక వేధింపుల నేపథ్యంలో ఆందోళనలు కొనసాగిస్తున్న రెజ్లర్లను కేంద్ర ప్రభుత్వం మరోసారి చర్చలకు ఆహ్వానించింది. అయితే ఈ సారి వారితో కేంద్ర క్రీడా శాఖల మంత్రి చర్చలు జరపనున్నారు. గత శనివారం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో చర్చలు జరిపిన అనంతరం రెజ్లర్లు తమ ఆందోళనను విరమించారని ప్రచారం సాగింది. ఈ నేపథ్యంలో తాము తమ నిరసనలను విరమించలేదని.. తమ విధుల్లో చేరామని రెజ్లర్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో రెజ్లర్లను ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించిందని కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ట్విట్టర్ పేర్కొన్నారు.
Read also: Wtc Final: నేడే డబ్ల్యూటీసీ ఫైనల్ ఫైట్.. మరి ట్రోఫీ ఎవరిదో..?
గత శనివారం రెజ్లర్లు హోం మంత్రి అమిత్ షాను కలిసి ఇదే అంశాలపై చర్చించిన విషయం తెలిసిందే. రెజ్లర్లతో వారి సమస్యలపై చర్చకు ప్రభుత్వం సుముఖంగా ఉందని.. దాని కోసం నేను మరోసారి రెజ్లర్లను ఆహ్వానిస్తున్నానని ఠాకూర్ ట్వీట్ చేశారు. శనివారం అమిత్ షాతో రెజ్లర్లు అర్థరాత్రి సమావేశాన్ని నిర్వహించిన అనంతరం ఒలింపిక్స్ పతక విజేత రెజ్లర్ బజరంగ్ పునియా ఒక జాతీయ జాతీయఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సమావేశం గురించి మాట్లాడవద్దని నిరసనకారులను ప్రభుత్వం కోరిందని గుర్తు చేశారు. దర్యాప్తు జరుగుతోందని అమిత్ షా తమకు చెప్పారని పునియా తెలిపారు. నిరసన ఉద్యమం ఆగిపోలేదని.. అది కొనసాగుతుందన్నారు. ప్రభుత్వ ప్రతిస్పందనతో క్రీడాకారులు సంతృప్తి చెందలేదని, తమ డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించడం లేదని చెప్పారు.
The government is willing to have a discussion with the wrestlers on their issues.
I have once again invited the wrestlers for the same.
— Anurag Thakur (@ianuragthakur) June 6, 2023