NTV Telugu Site icon

Champions Trophy Final: న్యూజిలాండ్తో ఫైనల్‌ ఫైట్.. కివీస్ కి సర్‌ప్రైజ్‌ ఇవ్వబోతున్న రోహిత్..?

Kiwis

Kiwis

Champions Trophy Final: దుబాయ్ వేదికగా న్యూజిలాండ్‌తో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌ ఆడేందుకు భారత్‌ రెడీ అయింది. మరి తుది జట్టు ఎలా ఉంటుందనే దానిపై ఇప్పటికే పలువురు తమ అభిప్రాయాలను తెలియజేశారు. అయితే, మరోసారి నలుగురు స్పిన్నర్లతో ఆడిస్తే మంచిదని క్రికెట్ పండితులు అంటున్నారు. 25 ఏళ్ల తర్వాత కివీస్‌తో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో తలపడుతుండటంతో తుది జట్టు ఎంపిక అత్యంత కీలకంగా మారింది. ఈ క్రమంలో రోహిత్‌ సేన ఒకే మార్పుతో బరిలోకి దిగే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.

Read Also: Bollywood : యాడ్ ద్వారా చిక్కులో పడిన స్టార్ హీరోలు

అయితే, ఫైనల్‌కు ముందు విరాట్ కోహ్లీ గాయపడినట్లు వార్తలు వచ్చాయి.. కానీ, అతడు తుది పోరులో ఆడటం ఖాయమని బీసీసీఐ వెల్లడించింది. దీంతో శుభ్‌మన్‌ గిల్‌తో కలిసి కెప్టెన్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్‌ను స్టార్ట్ చేయనున్నారు. ఆ తర్వాత విరాట్ వన్‌డౌన్‌లో రానుండగా.. శ్రేయస్‌ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, హార్దిక్‌ పాండ్య తర్వాత బ్యాటింగ్‌కు రానున్నారు. దీంతో మరోసారి రిషభ్ పంత్ బెంచ్‌కే పరిమితం కానున్నాడు. కాగా, ఈ మ్యాచ్‌కు అత్యంత కీలకం స్పిన్ డిపార్ట్మెంట్.. గత మ్యాచుల్లో నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగిన భారత జట్టు.. మరోసారి అదే కాంబినేషన్‌తో ఫైనల్ లో ఆడబోతుంది. ఇక, ఒక్క మార్పు చేయనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. బ్యాటింగ్‌ ఆర్డర్‌ను మరింత బలోపేతం చేయడంతో పాటు కుడి చేతి వాటం స్పిన్నర్‌ను తుది జట్టులోకి తీసుకోవాలనే ఉద్దేశంతో కుల్‌దీప్‌ యాదవ్ స్థానంలో వాషింగ్టన్ సుందర్‌ను ఆడిస్తారని సమాచారం.

Read Also: Chelluboyina Venu: ప్రజాజీవనాన్ని మార్చడానికి ప్రయత్నించింది వైసీపీ

కాగా, గత రెండు మ్యాచుల్లో కుల్‌దీప్‌ 17.3 ఓవర్లు వేసి 100 రన్స్ ఇచ్చి కేవలం 2 వికెట్లే తీసుకున్నాడు. దీంతో అతడిని పక్కన పెట్టి.. సుందర్‌ను తీసుకుంటే 9వ నంబర్‌ వరకు బ్యాటింగ్‌ చేసే అవకాశం ఉంటుందని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తుంది. పిచ్‌ బౌలింగ్‌కు సహకరిస్తున్నందున బ్యాటింగ్‌ కూడా చాలా కీలకమే కానుంది. ఇప్పటికే, జడేజా, అక్షర్, వరుణ్‌ చక్రవర్తితో కూడిన స్పిన్‌ విభాగం స్ట్రాంగ్ గా ఉంది. వారికి తోడుగా సుందర్‌ను తీసుకొస్తారని తెలుస్తుంది. కానీ, తుది జట్టుపై ఇప్పటి వరకు టీమ్‌ నుంచి ఎలాంటి అధికారిక నిర్ణయం రాలేదు.