IND vs PAK: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్- పాకిస్థాన్ దేశాల మధ్య భీకర యుద్ధం కొనసాగింది. ఆపరేషన్ సింధూర్ తో భారత్ చేసిన దాడులను దాయాది దేశం ఎదుర్కోలేక మన ముందు మోకరిల్లింది. దీంతో అక్కడి నుంచి ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతునే ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన ఆసియా కప్ లో పాక్ తో టీమిండియా మూడు మ్యాచ్ లు ఆడింది.. అందులో మూడింట్లో ఘగ విజయం సాధించి, దాయాది దేశం పరువు తీసింది. తమ ముందు పాక్ నిలిచే అవకాశం లేదని సూర్యకుమార్ యాదవ్ సేన నిరూపించింది.
Read Also: Delhi Metro: ఢిల్లీ మెట్రోలో డబ్ల్యూడబ్ల్యూఈ ఫైటింగ్.. వీడియో వైరల్
మరోవైపు, మహిళల వన్డే వరల్డ్ కప్ లో సేమ్ సీన్ రిపీట్ అయింది. టీమిండియా వరుస విజయాలతో ప్రపంచకప్‌లో దూసుకుపోతుండగా, పాకిస్థాన్ మాత్రం ఆ ఒత్తిడిని భరించలేక పోతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. భారత్ ప్రదర్శనపై అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు వెల్లువెత్తుతుండగా, పాక్ జట్టు ఆట తీరు, వ్యూహాలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. క్రీడా ప్రపంచంలో భారత్ ఆధిపత్యం రోజు రోజుకీ పెరుగుతుండటంతో, పాకిస్థాన్ అభిమానులు, ఆ దేశ మాజీ క్రికెటర్లు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారత బౌలర్ల దూకుడు, అద్భుతమైన బ్యాటింగ్, ఫిట్‌నెస్ స్థాయితో పాటు అన్నింట్లో పాకిస్థాన్ జట్టుతో పోల్చలేని స్థితికి టీమిండియా ప్లేయర్స్ ఎదిగారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే, భారత్ అన్ని విభాగాల్లో (అటు పురుషులు, మహిళల జట్లు) వరుస విజయాలతో టాప్ ర్యాంక్‌లో నిలుస్తుండగా, పాకిస్థాన్ మాత్రం దారుణ ఓటములతో వెనక బడిపోతుంది. పాపం, భారత్ డామినేషన్‌ను తట్టుకోలేని స్థితికి పాక్ చేరిందన్న కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారాయి.
