IND Vs SA 1st T20: కేఎల్ రాహుల్, సూర్యకుమార్ హాఫ్ సెంచరీలు.. తొలి టీ20లో టీమిండియా ఘనవిజయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND Vs SA 1st T20: తిరువనంతపురం వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో భారత్ ఘనవిజయం సాధించింది. 107 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 16.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి 8 వికెట్ల తేడాతో గెలుపు రుచి చూసింది. రోహిత్ డకౌట్ అయినా విరాట్ కోహ్లీ 3 పరుగులకే అవుటై నిరాశపరిచినా కేఎల్ రాహుల్ (51 నాటౌట్), సూర్యకుమార్ యాదవ్ (50 నాటౌట్) హాఫ్ సెంచరీలతో చెలరేగి భారత్‌కు విజయాన్ని అందించారు. కేఎల్ రాహుల్ తొలుత టెస్ట్ ఆటను ఆడినా తర్వాత వేగంగా ఆడాడు. అతడు 56 బంతుల్లో రెండు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 51 పరుగులు చేశాడు. సూర్యకుమార్ మరోసారి అదరగొట్టాడు. 33 బంతుల్లో 5 ఫోర్లు, మూడు సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. సఫారీ బౌలర్లలో రబాడ, నార్జ్‌కు తలో వికెట్ దక్కింది. ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యాన్ని సాధించింది.
Read Also:రూ.30,000లోపు బెస్ట్ 5G స్మార్ట్ ఫోన్స్
Also Read
- Cristiano Ronaldo కమ్‌బ్యాక్.. FIFA ప్రపంచకప్‌లో సరికొత్త చరిత్ర.. ఉజ్బెకిస్తాన్‌పై 5-0 భారీ విజయం.!
- IPL Player: బిగ్‌షాక్.. మహిళతో శారీరక సంబంధం.. ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ప్లేయర్‌పై పోలీస్ కేసు..
- Hardik And Yashasvi: KKR కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా..? ముంబయ్ ఇండియన్స్‌లోకి యశస్వి జైస్వాల్..?
- T20 World Cup: వరుస ఓటములు.. టీ20 ప్రపంచ కప్ నుంచి మరో జట్టు నిష్క్రమణ..
అంతకుముందు టీమిండియా బౌలర్లు చెలరేగిపోవడంతో దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. టాస్ గెలిచి ఫీల్డింగ్‌కు దిగిన భారత్.. గ్రీన్ వికెట్‌ను చక్కగా ఉపయోగించుకుంది. తొలి ఓవర్‌లోనే దీపక్ చాహర్ వికెట్ల పతనానికి నాంది పలికాడు. సఫారీ కెప్టెన్ టెంబా బవుమా(0)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. రెండో ఓవర్‌లో అర్ష్‌దీప్ సింగ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు బుట్టలో వేసుకున్నాడు. అయితే అతి తక్కువ బంతుల్లో తొలి 5 వికెట్లు కోల్పోయిన జట్టుగా దక్షిణాఫ్రికా జట్టు చెత్త రికార్డును నెలకొల్పింది. మార్‌క్రమ్ (25), పార్నెల్ (24), కేశవ్ మహరాజ్ (41) పోరాడారు. టీమిండియా బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్‌కు 3 వికెట్లు పడ్డాయి. అటు దీపక్ చాహర్, హర్షల్ పటేల్ తలో 2 వికెట్లు సాధించారు.
తాజావార్తలు
-
Delhi: తెల్లవారుజామున కలకలం.. కార్మికుల గుడిసెల్లో భారీ అగ్నిప్రమాదం.!
-
Heavy Rains: తెలంగాణ అంతటా విస్తరించిన రుతుపవనాలు.. రాబోయే మూడు రోజుల్లో భారీ వర్షాలు!
-
Redmi 17C: 5,160mAh బ్యాటరీతో రెడ్మీ 17C విడుదల.. 120Hz డిస్ప్లే, హీలియో G81 అల్ట్రా చిప్సెట్
-
Petrol Prices: పెట్రోల్ ధరలు తగ్గుతాయా? ఆయిల్ మిగులు దిశగా ప్రపంచ మార్కెట్?
-
Cristiano Ronaldo కమ్‌బ్యాక్.. FIFA ప్రపంచకప్‌లో సరికొత్త చరిత్ర.. ఉజ్బెకిస్తాన్‌పై 5-0 భారీ విజయం.!
ట్రెండింగ్
-
Toilet Cleaning : టాయిలెట్ క్లీనింగ్ చేస్తున్నారా..? అయితే ఈ 5 ఘోరమైన పొరపాట్లు అస్సలు చేయకండి.!
-
Cockroach Control : ఫ్రిజ్‌లో బొద్దింకల బెడదా.? ఈ సింపుల్ ట్రిక్‌తో చెక్ పెట్టండి..!
-
Ragi Biscuits : హెల్తీ రాగి బిస్కెట్లు ఎయిర్ ఫ్రైయర్లో 10 నిమిషాల్లో ఇలా చేసుకోండి.!
-
Kitchen Tips : నల్లబడిన వెండి ఆభరణాలు, వస్తువులు కొత్త వాటిలా మెరవాలా..? ఈ కిచెన్ ట్రిక్ సూపర్!
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!