Cricket: కామన్వెల్త్ క్రీడలకు భారత జట్టు ప్రకటన.. ఏపీ అమ్మాయికి అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కామన్వెల్త్ క్రీడల్లో అధికారులు మహిళల క్రికెట్‌కు చోటు కల్పించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది బర్మింగ్ హామ్ వేదికగా కామన్వెల్త్ క్రీడలు జరగనున్నాయి. ఈ క్రీడల్లో టీ20 ఫార్మాట్లో క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ మేరకు కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనేందుకు మహిళల టీమిండియా జట్టు ఇప్పటికే బర్మింగ్‌హోమ్ చేరుకుంది. తాజాగా ఈ టోర్నీలో పాల్గొనే 15 మంది ప్లేయర్స్ లిస్టును సెలక్టర్లు ప్రకటించారు. ఈ జట్టుకు హర్మన్‌ప్రీత్ కెప్టెన్‌గా, స్మృతి మంధాన వైస్‌కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి సబ్బినేని మేఘనకు జట్టులో చోటు దక్కింది.
కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనే భారత జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షెఫాలీ వర్మ, సబ్బినేని మేఘన, తానియా, యస్తిక , దీప్తి శర్మ, రాజేశ్వరి గైక్వాడ్, పూజా వస్త్రాకర్, మేఘన సింగ్, రేణుక సింగ్, జెమీమా, రాధా యాదవ్, హర్లీన్, స్నేహ్ రాణా.
Also Read
- SA Vs AUS: ఆస్ట్రేలియాపై వీర విహారం.. సెంచరీతో చెలరేగిన యువ బ్యాటర్ మాథ్యూ..
- Asian Games 2026: 16 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. 10,000 మీటర్ల రేసులో భారత్‌కు కాంస్య పతకం
- Best Captain: కపిల్, ధోనీ, కోహ్లీ, రోహిత్.. నలుగురిలో బెస్ట్ కెప్టెన్ ఎవరో తేల్చేసిన యువరాజ్ సింగ్ తండ్రి..
- Rob Walter: వైభవ్ సూర్యవంశీ తోక ముడుచుకోవడం ఖాయం.. బౌన్సర్లతో టార్చర్ చూపిస్తాం..
Read Also: ICC WTC: ఆసీస్‌పై విజయంతో భారత్ స్థానానికి ఎసరు పెట్టిన శ్రీలంక
కామన్వెల్త్ క్రీడల్లో జరిగే క్రికెట్‌లో మొత్తం 8 జట్లు పాల్గొంటున్నాయి. ఈ జట్లను రెండు గ్రూపులుగా అధికారులు విభజించారు.గ్రూప్-ఏలో భారత్, ఆస్ట్రేలియా, బార్బడోస్, పాకిస్థాన్ ఉండగా.. గ్రూప్-బిలో శ్రీలంక, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్లు ఉన్నాయి. కాగా ఈనెల 29న ఆస్ట్రేలియాతో భారత్ తన తొలి మ్యాచ్ ఆడనుంది. ఇటీవల టీ20 ఫార్మాట్‌లో శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత అమ్మాయిలు 2-1తో సొంతం చేసుకోవడంతో కామన్వెల్త్ క్రీడల్లో టీమిండియా ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది.

తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!