Team India Opening Pair: మరో రెండు నెలల్లో టీ20 ప్రపంచకప్ ముంచుకొస్తోంది. అయినా టీమిండియా సెట్ కాలేదు. మిడిలార్డర్, లోయరార్డర్ సంగతి దేవుడెరుగు. ముందు ఓపెనింగ్ జోడీ ఎవరంటే చెప్పలేని దుస్థితి నెలకొంది మన ఇండియా జట్టులో. ఎందుకంటే గత 12 నెలల్లో ఏకంగా 9 మందితో ఓపెనింగ్ జోడీలను టీమిండియా మేనేజ్‌మెంట్ పరీక్షించింది. కొంతమంది విజయవంతం అయినా వాళ్లను కొనసాగించకుండా కొత్తవాళ్లను పరీక్షిస్తూనే ఉంది. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలోనే ఈ వ్యవహారమంతా జరుగుతోంది. మాములుగానే అయితే రోహిత్-ధావన్ లేదా రోహిత్-కేఎల్ రాహుల్ ఓపెనింగ్‌కు దిగుతుంటారు. కానీ ధావన్ ఫామ్ కోల్పోవడం.. రాహుల్ గాయపడటంతో రోహిత్‌కు జోడీగా పలువురు ఆటగాళ్లను టీమ్ మేనేజ్‌మెంట్ బరిలోకి దింపుతోంది.
Vizag Zoo Park: బరితెగించిన యువకులు.. పందుల ఎన్‌క్లోజర్‌లోకి దూకి..Read Also:
గత 12 నెలల కాలంలో రోహిత్ శర్మ-కేఎల్ రాహుల్, కేఎల్ రాహుల్-ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ-ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్-ఇషాన్ కిషన్, సంజు శాంసన్-రోహిత్ శర్మ, దీపక్ హుడా-ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ-రిషభ్ పంత్ ఇన్నింగ్‌ను ఆరంభించిన మ్యాచ్‌లు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా సూర్యకుమార్ యాదవ్ కూడా రోహిత్ శర్మకు జత కట్టాడు. తాజాగా వెస్టిండీస్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో రోహిత్‌కు జోడీగా సూర్యకుమార్ యాదవ్ ఓపెనర్ అవతారం ఎత్తాడు. తొలి మ్యాచ్‌లో అతడు క్రీజులో నిలదొక్కుకోలేకపోయాడు. సూర్యకుమార్ విఫలం కావడంతో రెండో మ్యాచ్‌లో ఎవరు ఓపెనింగ్‌కు దిగుతారో చూడాలి. అతడి స్థానంలో రెండో మ్యాచ్‌లో ఇషాన్ కిషన్‌ను క్రీజ్‌లోకి దించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అభిమానులు భావిస్తున్నారు. కాగా జట్టు విజయాలకు ఢోకా లేనందున కేఎల్ రాహుల్ జట్టులో పునరాగమనం చేసేంత వరకు ఈ ప్రయోగాలు కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది.
