Pat Cummins Reaction : ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా మొదటి టెస్టులో ఓడి, ఎడ్జ్ బస్టన్లో జరిగిన 2వ టెస్టులో చరిత్రాత్మకమైన విజయాన్ని అందుకుంది. అయితే ఈ రెండు టెస్టుల్లో టీమిండియా బ్యాటర్లు అదరగొట్టారు. మరి ముఖ్యంగా కొత్త కెప్టెన్ శుభమన్ గిల్ అయితే వేరే రేంజులో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇప్పటికే రెండు టెస్టుల్లో కలిపి 3 సెంచరీలు బాదేశాడు. మొత్తంగా 500 పైగా పరుగులు చేసాడు. ఇక మొదటి టెస్టులో మనవాళ్ళు ఏకంగా 5 సెంచరీలు చేశారు.
HYDRA : రాజేంద్రనగర్‌లో హైడ్రా కూల్చివేతలు.. పార్క్ స్థలాన్ని కబ్జా చేశారంటూ వివాదం
టీంలో ప్రతి ఒక్కరు తనవంతు సహకారం అందిస్తున్నారు. ఇక బౌలింగ్లో కూడా పర్వాలేదనిపిస్తున్నారు. ఇంగ్లాండ్ బ్యాటర్లకు దీటుగా బదులిస్తున్నారు. దీంతో మొదటి టెస్టులో వికెట్లు తీయటంలో కాస్త వెనుకబడినా, రెండవ టెస్టులో చెలరేగారు. ముఖ్యంగా ఆకాష్ దీప్ ఏకంగా 10 వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇలా బౌలింగ్లోను, బ్యాటింగ్లోనూ ఈ కొత్త టీం అదరగొడుతున్నారు . దీనిపై తాజాగా ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ స్పందించాడు.
Periods Time Food: మహిళలకు పీరియడ్స్ సమయంలో అసౌకర్యానికి చెక్ పెట్టే పండ్ల జాబితా ఇదే!
ప్రస్తుతం విండీస్ పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా మొదటి 2 టెస్టులు గెలిచి సిరీస్ కైవసం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్ అనంతరం కమ్మిన్స్ మాట్లాడుతూ , ప్రస్తుతం గిల్ సేనను చూస్తుంటే భయం వేస్తోంది. అసలు ఆ బ్యాటింగ్ లో అలా ఆడతారని అనుకోలేదు. ఇక దాంతోపాటు అటువంటి పిచ్ లలో బౌలర్లకు ఏ మాత్రం సహకారం ఉండదు. కానీ టీమిండియా బౌలర్లు అద్భుతం చేశారు. అటువంటి ఫ్లాట్ పిచ్ మీద ఏ బౌలర్ కూడా బౌలింగ్ చేయడానికి ఇష్టపడడు అని చెప్పుకొచ్చాడు. అయితే మ్యాచ్ మొత్తం చూడలేదు కానీ, స్కోర్లు చూసాను. ప్రతి విభాగంలో వాళ్ళు బాగా ఆడారు అని పేర్కొన్నాడు.
