IND Vs NZ: న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో భారత్ గెలవకపోయినా మంచి ప్రదర్శనే చేసింది. ఒక దశలో హ్యాట్రిక్ వికెట్లు సాధించేలా కనిపించింది. అయినా హ్యాట్రిక్ నమోదైంది. అయితే ఈ హ్యాట్రిక్ బౌలర్ ఖాతాలో పడలేదు. టీమిండియా ఖాతాలో పడింది. అర్ష్‌దీప్ సింగ్ వేసిన 19వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ తొలి బంతికి రిషబ్ పంత్ స్టన్నింగ్ క్యాచ్‌తో డారిల్ మిచెల్ పెవిలియన్ బాట పట్టాడు. రెండో బంతిని అర్ష్‌దీప్ స్టన్నింగ్ యార్కర్ వేయగా.. ఇష్ సోదీ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో అందరి దృష్టికి హ్యాట్రిక్‌పై పడింది. కానీ అర్ష్‌దీప్ ఖాతాలో హ్యాట్రిక్ నమోదు కాకుండా సౌథీ అడ్డుపడ్డాడు. కానీ పరుగు కోసం క్రీజు దాటిన నాన్‌స్ట్రైకర్ ఆడమ్ మిల్నే(0)ను మహ్మద్ సిరాజ్ బుల్లెట్ త్రోతో రనౌట్ చేశాడు.
Read Also: Himanta Biswa Sarma: హిందూ అమ్మాయిలు ఎమోషనల్.. “లవ్ జీహాద్”పై కఠిన చట్టం అవసరం
బ్యాక్‌వార్డ్ పాయింట్ నుంచి టీమిండియా బౌలర్ సిరాజ్ విసిరిన బంతి నేరుగా నాన్‌స్ట్రైకర్ వికెట్లను తాకింది. దాంతో ఆడమ్ మిల్నే పెవిలియన్ చేరగా టీమిండియా ఖాతాలో హ్యాట్రిక్ చేరింది. ఈ పరిణామంతో న్యూజిలాండ్ 6 పరుగుల వ్యవధిలోనే 6 వికెట్లు కోల్పోయింది. 146/3తో పటిష్టంగా కనిపించిన న్యూజిలాండ్.. సిరాజ్, అర్ష్‌దీప్ అదరగొట్టడంతో సాధారణ స్కోరుకే పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 19.4 ఓవర్లలో 160 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ముఖ్యంగా మహ్మద్ సిరాజ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో కివీస్ బ్యాటర్లను ఒత్తిడిలోకి నెట్టాడు. కాగా ఈ మ్యాచ్ ద్వారా టీమిండియా బౌలర్లు సిరాజ్(4/17), అర్ష్‌దీప్ సింగ్(4/37) టీ20 ఫార్మాట్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణంకాలు నమోదు చేశారు.
Read Also: IND Vs NZ: ‘టై’గా ముగిసిన మూడో టీ20.. సిరీస్ టీమిండియాదే..!!
