Team India: పంత్‌ను ఎలా కొనసాగిస్తారు? శాంసన్ బలిపశువా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Team India: న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డే వర్షార్పణం అయినా ఈ వన్డేలో టీమిండియా జట్టు ఎంపిక పలు విమర్శలకు తావిచ్చింది. తొలి వన్డేలో 36 పరుగులతో రాణించిన సంజు శాంసన్‌ను పక్కనబెట్టి అతడి స్థానంలో దీపక్ హుడాను తీసుకోవడంపై అభిమానులు మండిపడుతున్నారు. తొలి వన్డేలో ఐదుగురు బౌలర్లతోనే బరిలోకి దిగడం టీమిండియాను దెబ్బతీసిందని.. అందుకే రెండో వన్డేలో దీపక్ హుడాను తీసుకున్నట్లు టీమిండియా కెప్టెన్ శిఖర్ ధావన్ వివరణ ఇచ్చాడు. అయితే పదే పదే విఫలమవుతున్న రిషబ్ పంత్ స్థానంలో దీపక్ హుడాకు చోటు ఇవ్వాల్సిందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. జట్టులో ఎవరు ఆడకపోయినా టీమిండియా మేనేజ్‌మెంట్ మాత్రం సంజూనే బలిపశువును చేస్తోందని సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
Read Also: Ram Charan: వాలెంటైన్స్ డేకి మెగా పవర్ స్టార్ సినిమా రిలీజ్ అవుతుందా?
Also Read
- Sarfaraz Khan: నేను ఇమడలేకపోతున్నాను.. కానీ పోరాడతా'.. సర్ఫరాజ్ పోస్ట్ వైరల్.. అసలు అర్థం ఇదేనా?
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ సిక్స్‌లు, ఫోర్లు కొడితే సరిపోతుందా..? ‘అతడిని తప్పించండి’..
- Mohammed Siraj: కొలంబోలో 'డీఎస్పీ సాబ్' రచ్చ.. సరికొత్త లుక్‌తో మైదానంలో మెరిసిన సిరాజ్
- Trent Boult విధ్వంసం.. యార్కర్‌తో బెయిర్‌స్టోకు షాక్.! 'బై-బై' సెలబ్రేషన్ వీడియో వైరల్.!
నిలకడగా రాణిస్తున్న సంజు శాంసన్‌కు సరిపడా అవకాశాలు ఇవ్వకుండా అతడి కెరీర్ నాశనం చేస్తున్నారని టీమిండియా అభిమానులు మండిపడుతున్నారు. ఎంత చెత్తగా ఆడుతున్నా రిషభ్ పంత్ వంటి ఆటగాళ్లను కొనసాగిస్తున్నారని, వాళ్లకు అవకాశాలు ఇస్తూనే ఉన్నారని విమర్శలు చేస్తున్నారు. ఈ ఏడాది అన్ని ఫార్మాట్‌లలో సంజూ చక్కగా రాణించాడని ఫ్యాన్స్ గుర్తుచేస్తున్నారు. అయినా అతడికి టీ20 సిరీస్‌లో అవకాశం ఇవ్వలేదని.. చివరకు తొలి వన్డేలో ఒకే ఒక అవకాశం ఇచ్చారని.. తొలి మ్యాచ్‌లో 36 పరుగులు చేసిన సంజు శాంసన్.. శ్రేయాస్ అయ్యర్‌తో కలిసి విలువైన భాగస్వామ్యం నెలకొల్పాడని అంటున్నారు. అతడు రాణించినా.. విఫలమైనా ఏదో ఒక చెత్త కారణం చూపించి జట్టులో నుంచి తీసివేస్తున్నారని అభిమానులు ఆరోపిస్తున్నారు.
తాజావార్తలు
-
Kochi Flight: గాల్లో ఉండగా ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు యత్నం.. హడలెత్తిపోయిన ప్రయాణికులు
-
AP DSC 2026: టీచర్ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్‌న్యూస్.. త్వరలో కొత్త డీఎస్సీ..
-
Varuna Yagam: నాగార్జున సాగర్‌లో సీఎం రేవంత్ రెడ్డి వరుణ యాగం.. ముహూర్తం ఖరారు..
-
FCRA Bill: ‘మా చట్టాల గురించి మీకెందుకు?’.. అమెరికాకు భారత్ ఘాటు సమాధానం
-
Sarfaraz Khan: నేను ఇమడలేకపోతున్నాను.. కానీ పోరాడతా’.. సర్ఫరాజ్ పోస్ట్ వైరల్.. అసలు అర్థం ఇదేనా?
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్‌ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!