NTV Telugu Site icon

WI vs NZ: టీ20 ప్రపంచకప్ సూపర్ 8కు వెస్టిండీస్‌.. న్యూజిలాండ్‌ ఇంటికి!

West Indies Team

West Indies Team

New Zealand Eliminate Form T20 World Cup 2024: ఆతిథ్య వెస్టిండీస్‌ అద్భుత ప్రదర్శనను కొనసాగిస్తూ.. టీ20 ప్రపంచకప్ 2024 సూపర్ 8కు దూసుకెళ్లింది. బ్రియాన్ లారా స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో గెలుపుతో సూపర్ 8కు అర్హత సాధించింది. 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 136 పరుగులకే పరిమితమవ్వడంతో విండీస్ 13 రన్స్ తేడాతో గెలుపొందింది. వరుసగా రెండు ఓటములతో కివీస్ సూపర్ 8 అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది.

ఇటీవలి ఐసీసీ టోర్నీల్లో న్యూజిలాండ్‌ అద్భుతంగా రాణిస్తోంది. అయితే టీ20 ప్రపంచకప్‌ 2024 మాత్రం కివీస్‌కు కలిసిరాలేదు. తొలి మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌ చేతిలో ఘోర పరాజయం చెందడం కివీస్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. నెట్‌ రన్‌రేట్‌లో భారీగా వెనకపడింది. ఇక కీలకమైన రెండో మ్యాచ్‌లోనూ వెస్టిండీస్‌ చేతిలో ఓటమిపాలైంది. దాంతో కివీస్ ఇంటికి వెళ్లడం ఖాయం అయింది. ప్రస్తుతం గ్రూప్-సీలో విండీస్‌ 3 మ్యాచ్‌ల్లో గెలిచి 6 పాయింట్లు (+2.596 నెట్‌ రన్‌రేట్‌) ఖాతాలో వేసుకుని పట్టికలో అగ్రస్థానంలో ఉంది. అఫ్గానిస్థాన్‌ రెండు మ్యాచ్‌ల్లో 4 పాయింట్లు (+5.225 నెట్‌రన్‌రేట్‌) రెండో స్థానంలో ఉంది. కివీస్‌ (-2.425) చివరి మ్యాచ్‌ల్లో గెలిచినా అఫ్గాన్‌ రన్‌రేట్‌ను అధిగమించడం అసాధ్యం.

Also Read: Salman Khan: కాల్పుల ఘటనపై 150కి పైగా ప్రశ్నలు.. సల్మాన్ స్టేట్‌మెంట్‌ను రికార్డ్‌ చేసుకున్న పోలీసులు!

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 149 రన్స్ చేసింది. షెర్ఫానె రూథర్‌ఫోర్డ్ (68: 39 బంతుల్లో) హాఫ్ సెంచరీ చేశాడు. 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 139 రన్స్ చేసి.. 13 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. గ్లెన్‌ ఫిలిప్స్ (40), ఫిన్‌ అలెన్ (26), మిచెల్ సాంట్నర్ (21 నాటౌట్) పోరాడినా ఫలితం లేకుండా పోయింది. విండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్‌ (4/19), మోతీ (3/25) రాణించారు.