Site icon NTV Telugu

Hardik Pandya Dance: హార్దిక్ పాండ్యా డ్యాన్స్.. నవ్వుకున్న విరాట్ కోహ్లీ!

Hardik Pandya Dance

Hardik Pandya Dance

Hardik Pandya Dance at ITC Maurya: వెస్టిండీస్ గడ్డపై టీ20 ప్రపంచకప్‌ 2024 సాధించి.. విశ్వవేదికపై భారత జెండాను రెపరెపలాడించిన రోహిత్‌ సేన సగర్వంగా భారత్‌కు చేరుకుంది. బార్బడోస్ నుంచి టీమిండియా ప్రత్యేక విమానంలో గురువారం ఉదయం ఢిల్లీకి చేరుకుంది. ఢిల్లీ విమానాశ్రయంలో భారత జట్టుకు ఘన స్వాగతం లభించింది. కేరింతలు, హర్షద్వానాలతో రోహిత్ సేనకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ‘జయహో భారత్‌’ నినాదాలతో ఢిల్లీ విమానాశ్రయం మార్మోగిపోయింది.

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లోకి ఎంటర్‌ కాగానే.. అభిమానులు ఒక్కసారిగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దాంతో రోహిత్‌ ప్రపంచకప్‌ ట్రోఫీని పైకెత్తి చూపుతూ.. అభిమానులకు అభివాదం చేశాడు. ఎయిర్‌పోర్ట్‌ నుంచి భారత క్రికెటర్లు ప్రత్యేక బస్సులో ఐటీసీ మౌర్య హోటల్‌కు చేరుకున్నారు. హోటల్‌ వద్ద కూడా భారత క్రికెటర్లకు ఘన స్వాగతం లభించింది. హోటల్‌ ఎంట్రెన్స్‌లో కళాకారులు సంప్రదాయ నృత్యాలు చేస్తూ.. క్రికెటర్లకు ఆహ్వానం పలికారు. డోల్‌ వాయింపుకు కళాకారులతో కలిసి హార్దిక్ పాండ్యా స్టెప్పులు వేశాడు. అప్పుడే బస్సులోంచి దిగిన విరాట్ కోహ్లీ.. హార్దిక్ స్టెప్పులకు నవ్వులు పూయించాడు. నవ్వుకుంటూ హోటల్‌ లోనికి వెళ్ళిపోయాడు.

Also Read: Gold Price Today: భారీ షాక్.. తులం బంగారంపై రూ.710 పెరిగింది!

రోహిత్‌ శర్మ, సూర్యకుమార్‌ యాదవ్, రిషబ్‌ పంత్‌లు కూడా డ్యాన్స్‌ చేశారు. రోహిత్‌ డ్యాన్స్‌ చేస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అయింది. హోటల్‌ యాజమాన్యం భారత జట్టు కోసం ప్రత్యేక కేక్‌ను ఏర్పాటు చేసింది. టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కేక్‌ను కట్‌ చేశాడు. ఇప్పటికే టీమిండియా ప్లేయర్స్ రోహిత్ సేనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అందరితో ప్రధాని ముచ్చటించారు. ప్రధానితో భేటీ అనంతరం టీమిండియా ముంబైకు పయనమైంది.

Exit mobile version