NTV Telugu Site icon

USA vs IRE: సూపర్‌ 8కు అమెరికా.. టీ20 ప్రపంచకప్‌ నుంచి పాకిస్థాన్‌ ఔట్!

Pakistan Team

Pakistan Team

Pakistan Out From T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌ 2024లో పసికూన అమెరికా సూపర్‌ 8కు దూసుకెళ్లింది. గ్రూప్‌-ఏలో భాగంగా శుక్రవారం ఫ్లోరిడా వేదికగా అమెరికా, ఐర్లాండ్‌ మధ్య జరగాల్సిన మ్యాచ్‌.. వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్‌ దక్కింది. గ్రూప్‌ దశలో నాలుగు మ్యాచ్‌ల్లో 5 పాయింట్లు సాధించిన అమెరికా.. సూపర్‌-8 దశకు అర్హత సాధించింది. అమెరికా సూపర్‌-8 చేరడం ఇదే మొదటిసారి.

వర్షం కారణంగా అమెరికా, ఐర్లాండ్‌ మ్యాచ్ రద్దవడంతో టీ20 ప్రపంచకప్‌ 2024 నుంచి పాకిస్తాన్ నిష్క్రమించింది. పాక్ మూడు మ్యాచ్‌ల్లో ఒక విజయం మాత్రమే సాధించి.. ప్రస్తుతం రెండు పాయింట్లతో ఉంది. తన చివరి మ్యాచ్‌ ఐర్లాండ్‌తో జూన్ 16న తలపడనుంది. ఆ మ్యాచ్‌లో పాకిస్తాన్ గెలిచినా.. నాలుగు పాయింట్లు మాత్రమే ఉంటాయి. దీంతో ఐర్లాండ్‌తో మ్యాచ్‌ పాకిస్థాన్‌కి నామామాత్ర పోరుగా మిగలనుంది.

Also Read: Son Kills Parents: కొడుకు కాదు కర్కోటకుడు.. తల్లి ఒంటిపై బంగారం కోసం తల్లిదండ్రులను చంపేశాడు..

మరోవైపు గ్రూప్‌-ఏలో భారత్‌ ఇప్పటికే సూపర్‌ 8 బెర్త్‌ ఖరారు చేసుకుంది. ఆడిన మూడింటిలోనూ రోహిత్ సేన గెలిచింది. నేడు కెనడాతో భారత్‌ తలపడనుంది. ఇది నామమాత్రపు పోరే. ఇందులో గెలిచినా, ఓడినా ఫలితాలపై ఎలాంటి ప్రభావం ఉండదు. కెనడాతో మ్యాచ్‌ను భారత్ మంచి ప్రాక్టీస్‌గా వాడుకోనుంది. సూపర్‌ 8లో జూన్‌ 19న దక్షిణాఫ్రికాతో, జూన్‌ 21న వెస్టిండీస్‌తో అమెరికా తలపడనుంది. జూన్‌ 23న B1 (ఇంగ్లాండ్‌/స్కాట్లాండ్‌) జట్టుతో తలపడనుంది. ఈనెల 20న అఫ్గాన్‌తో, 22న గ్రూప్‌ D2 (బంగ్లాదేశ్‌/నెదర్లాండ్స్‌తో, 24న ఆస్ట్రేలియాతో భారత్‌ తలపడనుంది.