NTV Telugu Site icon

T20 World Cup 2024: సూర్యకుమార్ నాకు చాలా క్లోజ్‌ ఫ్రెండ్: అమెరికా క్రికెటర్

Saurabh Netravalkar

Saurabh Netravalkar

Monank Patel Said I Played with Axar Patel and Jasprit Bumrah in India: టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా తాజాగా భారత్, అమెరికా జట్ల మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించినా.. ఓ దశలో రోహిత్ సేనను అమెరికా వణికించింది. ఇందుకు కారణం భారత సంతతి ఆటగాళ్లే. అమెరికా జట్టులో సగానికి పైగా భారత సంతతి ఆటగాళ్లు ఆడుతున్నారు. అందులో కొంతమంది జూనియర్‌ లెవల్‌లో భారత్ తరఫున బరిలోకి దిగారు. ప్రస్తుతం టీమిండియాలో కీలకంగా ఉన్న కొందరి ఆటగాళ్లతోనూ కలిసి ఆడారు. భారత్‌తో మ్యాచ్‌కు ముందు స్టార్‌స్పోర్ట్స్‌ చాట్‌లో అమెరికా ఆటగాళ్లు సౌరభ్‌ నేత్రావల్కర్‌, మోనాంక్ పటేల్.. భారత ప్లేయర్స్‌తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

సౌరభ్‌ నేత్రావల్కర్ మాట్లాడుతూ… ‘సూర్యకుమార్ యాదవ్ నాకు చాలా క్లోజ్‌ ఫ్రెండ్. అండర్-15 రోజుల నుంచి నేను సూర్యని చూస్తున్నాను. అతడు అప్పుడే బాగా ఆడేవాడు. సూర్య ఎప్పుడూ ప్రత్యేక ఆటగాడే. అండర్-15, అండర్-17లో డబుల్ సెంచరీలు చేశాడు. అయితే నేను ఊహించిన దానికంటే చాలా ఆలస్యంగా భారత జట్టులోకి వచ్చాడు. ఇప్పుడు సూర్య ఆటతీరుపై చాలా సంతోషంగా ఉన్నా. అతడిని కలుసుకోవడంతో ఆనందంగా ఉంది. ఇరు జట్లకు ఇదే మొదటి మ్యాచ్. చాలా సంతోషంగా ఉంది’ అని అన్నాడు.

Also Read: Uttam Kumar Reddy : గత ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసింది

అమెరికా కెప్టెన్ మోనాంక్ పటేల్ మాట్లాడుతూ… ‘నేను అండర్-15, అండర్-19 మ్యాచ్‌లలో అక్షర్ పటేల్‌, జస్ప్రీత్ బుమ్రాతో కలిసి ఆడాను. అక్షర్, నాది గుజరాత్‌లోని ఆనంద్ జిల్లా. అక్షర్ మా జిల్లాలో చాలామంది యువకులను ప్రోత్సహించాడు. అతడు భారత జట్టులో ఉన్నందుకు సంతోషిస్తున్నాను. అక్షర్ మంచి ప్లేయర్’ అని చెప్పాడు. గాయం కారణంగా మోనాంక్ పటేల్ టీమిండియాపై ఆడలేదు. ఆరోన్ జోన్స్ అతడి స్థానంలో సారథ్యం వహించాడు.