Site icon NTV Telugu

WI vs UGA: విండీస్ బౌలర్ల దెబ్బకు బెంబెలెత్తిన ఉగాండా.. 39 పరుగులకే ఆలౌట్..

Wi

Wi

ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ 2024 ​లో భాగంగా ఉగాండా, వెస్టిండీస్ ​కు మధ్య జరిగిన మ్యాచ్​లో వెస్టిండీస్ భారీ విజయం సాధించింది. ఉగాండా​ జట్టుపై ఏకంగా 134 పరుగుల తేడాతో భారీ విజయాన్ని విండిస్ తన ఖాతాలో వేసుకుంది. ఇక మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు నిర్ణిత 20 ఓవర్లులో 5 వికెట్లు కోల్పోయి 173 పరుగులు సాధించింది. ఇక విండిస్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని చేధించలేక ఉగాండా ప్లేయర్లు చతికిలపడ్డారు. దీంతో 173 పరుగులుకు చేరువయ్యేందుకు ప్రయత్నించేలోపు కేవలం 12 ఓవర్లలో 39 పరుగులుకే ఆలౌట్ అయ్యారు. జుమా మిగాయి (13) తప్ప ఉగాండా జట్టులో మరెవరూ రెండెంకల స్కోర్ చేయలేకపోయారు.

Bhaje Vaayu Vegam : ఓటీటీలోకి వచ్చేస్తున్న’భజే వాయు వేగం’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

ఇక వెస్టిండీస్ బౌలర్లలో అకీయస్ హోసేన్​ 5 వికెట్లు తీసి జట్టును ఒంటి చేత్తో గెలిపించాడు. ఇక అల్జారీ జోసెఫ్ రెండు వికెట్లు పడగొట్టగా, రోమారిపో షెపర్ట్, ఆండ్రీ రసెల్​, గుడకేశ్ మోతీలు చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. మొత్తంగా వెస్టిండీస్ జట్టు 134 పరుగుల బారి విజయాన్ని అందుకుంది. ఇక వెస్టిండీస్ జట్టులో జాన్సన్ చార్లెస్ 44 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.

SBI ATM: ఎస్‌బీఐ ఏటీఎం సెంటర్లో చోరీ.. రూ.18,41,300 నగదు అపహరణ..

Exit mobile version