Site icon NTV Telugu

Team India New Jersey: టీ20 ప్రపంచకప్ కోసం కొత్త జెర్సీ.. స్టోర్‌, ఆన్‌లైన్‌లో లభ్యం!

Team India New Jersey

Team India New Jersey

Adidas unveiled Team India New Jersey ahead of T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌ 2024 జూన్ 2 నుంచి ఆరంభం కానుంది. ఈ మెగా టోర్నీకి అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. పొట్టి ప్రపంచకప్‌ కోసం దాదాపుగా అన్ని బోర్డులు తమ జట్లను ప్రకటించాయి. భారత జట్టును బీసీసీఐ గత వారం ప్రకటించింది. రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు 2007 తర్వాత మరోసారి టీ20 ప్రపంచకప్ ట్రోఫీని కైవసం చేసుకోవాలని చూస్తోంది. జూన్ 5న న్యూయార్క్‌లో ఐర్లాండ్‌తో జరిగే మ్యాచ్‌తో భారత్ ట్రోఫీ వేట ప్రారంభించనుంది.

టీ20 ప్రపంచకప్ 2024 ప్రారంభానికి సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు కొత్త జెర్సీని బీసీసీఐ ఈరోజు ధర్మశాలలో ఆవిష్కరించింది. స్పోర్ట్స్‌వేర్ దిగ్గజం, భారత క్రికెట్ జట్టు అధికారిక కిట్ స్పాన్సర్‌ అడిడాస్ కొత్త జెర్సీకి సంబందించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వీడియోలో కొత్త ఇండియా కిట్‌తో ఓ హెలికాప్టర్ ఆకాశంలోకి ఎగురుతుండగా.. రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్‌లు చుస్తున్నారు. జెర్సీలో భుజాలు నారింజ రంగులో ఉండగా.. మిగిలిన భాగం నీలం రంగులో ఉంది. ఇక అడిడాస్ ఐకానిక్ మూడు చారలు తెలుపు రంగులో భుజాలపై ఉన్నాయి.

Also Read: Asha Sobhana Debut: 13 ఏళ్ల వ‌య‌స్సులో క్రికెట్ వైపు అడుగులు.. 33 ఏళ్లకు భారత జట్టులో అరంగేట్రం!

భారత్ కొత్త కిట్‌కి సంబంధించిన ఫోటోలు, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అడిడాస్ పోస్ట్ చేసిన వీడియోను బీసీసీఐ రీ ట్వీట్ చేసింది. ‘ఒక జెర్సీ. వన్ నేషన్. టీ20 ప్రపంచకప్ 2024 కోసం టీమిండియా కొత్త టీ20 జెర్సీని ప్రజెంట్ చేశాం. మే 7వ తేదీ ఉదయం 10 గంటలకు అడిడాస్ స్టోర్‌లలో మరియు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి’ అని బీసీసీఐ పేర్కొంది.

Exit mobile version