Site icon NTV Telugu

T20 World Cup 2026: భారత్ సెమీస్‌ చేరితే.. ఎదుర్కోబోయే ప్రత్యర్థి ఎవరంటే?

Team India

Team India

T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ 2026 ఇప్పుడు ఉత్కంఠభరితమైన స్థాయికి చేరుకుంది. సూపర్ 8 స్టేజ్‌లో గ్రూప్-1 నుండి దక్షిణాఫ్రికా ఇప్పటికే సెమీ-ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. మెరుగైన నెట్ రన్ రేట్‌తో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన ప్రోటీస్ జట్టు సెమీస్‌కు దూసుకెళ్లింది. ఇక ఈ గ్రూప్ నుండి రెండో సెమీఫైనలిస్ట్ ఎవరనేది మార్చి 1న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్, వెస్టిండీస్ మధ్య జరిగే పోరుతో తేలిపోనుంది.

T20 World Cup 2026: పాకిస్తాన్ సెమీస్ ఆశలు సజీవం.. కానీ, ఇలా గెలిస్తేనే..!

భారత్, వెస్టిండీస్ జట్లకు సెమీస్ అవకాశాలను నిర్ణయించే ‘డూ ఆర్ డై’ మ్యాచ్ ఇది. ప్రస్తుతం టీమ్ ఇండియా ఆడిన 2 మ్యాచ్‌ల్లో ఒక మ్యాచ్ లో ఒడి, మరో మ్యాచ్ లో గెలిచి 2 పాయింట్లతో ఉంది. అటు వెస్టిండీస్ కూడా సమానమైన పాయింట్లతో సెమిస్ పోటీలో ఉంది. భారత్ ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను ఓడిస్తే.. 4 పాయింట్లతో గ్రూప్‌లో రెండో స్థానంలో నిలిచి సెమీఫైనల్ టికెట్ ఖరారు చేసుకుంటుంది. ఒకవేళ భారత్ ఓడిపోతే.. టోర్నీ నుండి నిష్క్రమించాల్సి ఉంటుంది. అందుకే ఈ మ్యాచ్ ఒక క్వార్టర్ ఫైనల్‌ను తలపిస్తోంది.

ఒకవేళ భారత్ వెస్టిండీస్‌పై గెలిచి సెమీస్‌కు అర్హత సాధిస్తే.. తదుపరి ప్రత్యర్థి ఎవరు అనే ఆసక్తి ఇప్పుడు అందరిలోనూ నెలకొంది. ఐసీసీ నిబంధనల ప్రకారం గ్రూప్-1లో రెండో స్థానంలో నిలిచే జట్టు, గ్రూప్-2లో అగ్రస్థానంలో ఉన్న జట్టుతో తలపడాలి. ప్రస్తుతం గ్రూప్-2లో ఇంగ్లాండ్ వరుసగా 3 విజయాలతో అజేయంగా నిలిచి టేబుల్ టాప్‌లో ఉంది. కాబట్టి, భారత్ గ్రూప్-1 నుండి రెండో జట్టుగా క్వాలిఫై అయితే.. సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్‌తో తలపడటం ఖాయం.

IPL 2026: ఐపీఎల్ వాయిదా.. ప్రారంభ మ్యాచ్ అప్పుడే..!

ఈ హై-వోల్టేజ్ సెమీ-ఫైనల్ మ్యాచ్ మార్చి 5న ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనుంది. సొంత గడ్డపై ఇంగ్లాండ్ జట్టును ఎదుర్కోవడం భారత్ కు సవాలుతో కూడుకున్న పని. ఇదివరకు 2022 టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్‌లో కూడా భారత్-ఇంగ్లాండ్ జట్లే తలపడ్డాయి. ఆ సమయంలో ఇంగ్లాండ్ ఘనవిజయం సాధించి భారత్‌ను టోర్నీ నుండి బయటకు పంపింది. ఈసారి కనుక భారత్ సెమీస్‌లో ఇంగ్లాండ్‌ను ఢీకొంటే.. ఆనాటి పరాజయానికి ప్రతీకారం తీర్చుకునే గొప్ప అవకాశం లభిస్తుంది.

Exit mobile version