Pakistan Super 8: టీమిండియా సాయం.. పాకిస్తాన్ సూపర్-8 అవకాశాలు మెరుగు!
- సూపర్-8 రేసు రసవత్తరం
- పరోక్షంగా పాకిస్తాన్‌కు భారత్ సాయం
- పాకిస్తాన్ సూపర్-8 అవకాశాలు ఇలా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 World Cup 2024 Pakistan Super 8 Chances: టీ20 ప్రపంచకప్ 2024 సూపర్-8 రేసు రసవత్తరంగా మారింది. ఇప్పటివరకు నాలుగు గ్రూప్‌లలో ఒక్కో టీమ్ మాత్రమే సూపర్-8 అర్హత సాధించింది. పసికూనల దెబ్బకు కొన్ని టాప్ టీమ్స్ ఇంటిదారి పడుతున్నాయి. ఇప్పటికే శ్రీలంక, న్యూజీలాండ్, ఇంగ్లండ్ లాంటి టీమ్స్ సూపర్-8 చేరకుండానే మిశ్రమించనున్నాయి. పాకిస్తాన్ కూడా గ్రూప్ నుంచే ఇంటిదారి పట్టే పరిస్థితిలో ఉంది. అయితే తాజాగా అమెరికాపై భారత్ విజయం సాధించడంతో పాక్ సూపర్-8 అవకాశాలు కాస్త మెరుగైయ్యాయి. అంటే ఇక్కడ పరోక్షంగా పాకిస్తాన్‌కు భారత్ సాయం చేసిందన్న మాట.
హ్యాట్రిక్ విజయాలు సాధించిన భారత్.. గ్రూప్-ఏ నుంచి సూపర్-8కు క్వాలిఫై అయింది. మిగిలిన ఏకైక బెర్తు కోసం అమెరికా, పాకిస్థాన్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ప్రస్తుతం మూడు మ్యాచ్‌లు ఆడిన అమెరికా.. రెండు విజయాలు సాధించి నాలుగు పాయింట్ల (+0.127 నెట్‌రన్‌రేట్)తో రెండో స్థానంలో ఉంది. పాకిస్థాన్ మూడు మ్యాచ్‌లలో ఒకటి నెగ్గి.. రెండు పాయింట్ల (+0.191 నెట్‌రన్‌రేట్)తో మూడో స్థానంలో ఉంది. కెనడా, ఐర్లాండ్ జట్ల నెట్‌రన్‌రేట్ మైనస్‌లో ఉండడంతో రేసులో లేవు.
Also Read
- Sachin Tendulkar: ‘బౌలర్లను అలా చూడలేకపోతున్నా’.. సచిన్ టెండూల్కర్ తీవ్ర ఆవేదన..
- T20 Rankings: టీ20 ర్యాంకింగ్స్ విడుదల.. ఈ సారి టీమిండియా ర్యాంక్ ఎంతో తెలుసా..
- Shubman Gill Instagram Post Creates Stir: శుభ్‌మన్ గిల్ పోస్ట్‌పై దుమారం.. ఆటాడుకుంటున్న క్రికెట్ ఫ్యాన్స్..
- Arshdeep Singh and Daryl Mitchell Controversy: అర్ష్‌దీప్ సింగ్‌ను వెనకేసుకొచ్చిన గంభీర్.. మిచెల్‌కు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు..!
Also Read: Virat Kohli: ముందుండి అసలు పండగ.. కాస్త ఓపిగ్గా ఆడు విరాట్: సన్నీ
భారత్ చేతిలో ఓడిన అమెరికా నెట్‌రన్‌రేట్‌ను కూడా కోల్పోయింది. ప్రస్తుతం నెట్‌రన్‌రేట్ పరంగా యూఎస్ కంటే పాక్ మెరుగైన స్థితిలో ఉంది. దీంతో పాకిస్తాన్ అవకాశాలు మెరుగయ్యాయి. అయితే పాక్ సూపర్-8కు అర్హత సాధించాలంటే.. తమ చివరి మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై తప్పక నెగ్గాలి. మరోవైపు ఐర్లాండ్ చేతిలో అమెరికా ఓడిపోవాలి. ఈ రెండు జరిగితేనే నెట్‌రన్‌రేట్‌తో సంబంధం లేకుండా పాక్ నేరుగా సూపర్ 8కు వస్తుంది. ఒకవేళ ఈ రెండు మ్యాచ్‌లలో వర్షం కామరణంగా ఏ ఒక్కటి రద్దయినా పాకిస్థాన్ ఇంటికి వెళ్లాల్సిందే. చూడాలి మరి పాక్ సూపర్-8 చేరుతుందో లేదో.
తాజావార్తలు
-
Imax in Hyderabad : ‘AMB ఐమాక్స్’.. మహేష్ బాబు, వెంకటేష్ లీగ్ కాంబోలో క్రేజీ మల్టీప్లెక్స్
-
lizards: ఇంట్లో బల్లుల బెడదా? పైసా ఖర్చు లేకుండా శాశ్వతంగా తరిమికొట్టేందుకు అద్భుతమైన చిట్కాలు ఇవే!
-
Virat Kohli Video: విన్నింగ్ షాట్ తర్వాత విరాట్ కోహ్లీ వింత సెలబ్రేషన్.. ఆ సైగకు అర్థం ఏమిటి..? వీడియో వైరల్..
-
Virat Kohli Next Match: RCBకి ఐపీఎల్ 2026 టైటిల్ అందించిన విరాట్ కోహ్లీ.. మళ్లీ బరిలోకి దిగేది ఎప్పుడు..?
-
TGPSC Notifications: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. రేపు మూడు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తామన్న టీజీపీఎస్సీ చైర్మన్..
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!