Suryakumar Yadav Reacton goes Viral after Virat Kohli Out: టీ20ల్లో టాప్ ర్యాంకర్‌గా కొనసాగడానికి తనకు పూర్తి అర్హత ఉందని టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ మరోసారి నిరూపించాడు. టీ20 ప్రపంచకప్ 2024 సూపర్-8లో అఫ్గాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సూర్య (53: 28 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్ సెంచరీ బాదాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ ఔటైనప్పుడు జట్టుపై ప్రతికూల ప్రభావం పడకుండా.. సూపర్ ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. అయితే కీలక సమయంలో కోహ్లీ ఔట్ అయినపుడు సూరీడు తీవ్ర అసహనానికి గురయ్యాడు. ఈ సమయంలో బబుల్ గమ్‌ను ఇంకాస్త గట్టిగా నమిలాడు. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అయింది.
మ్యాచ్ అనంతరం బబుల్ గమ్‌ను ఎందుకు గట్టిగా నమలాల్సి వచ్చిందో సూర్యకుమార్ యాదవ్ వివరించాడు. ‘మిడిల్ ఓవర్లలో బ్యాటింగ్ చేయడాన్ని నేను ఎప్పుడూ ఆస్వాదిస్తా. అందుకు తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తాను. ప్రత్యర్థి బౌలర్లు మ్యాచ్‌పై పట్టు సాధించే సమయం అత్యంత క్లిష్టమైంది. ఆ సమయంలో దూకుడుగా ఆడాలి. అలా ఆడటం నాకిష్టం. ఈ మ్యాచ్‌లో అదే చేశా. కీలక సమయంలో విరాట్ కోహ్లీ ఔట్ అవ్వడం బాధించింది. ఆ సమయంలో టెన్షన్‌కు గురికాకుండా ఉండేందుకు బబుల్ గమ్‌ను ఇంకాస్త గట్టిగా నమిలా. దాంతో మళ్లీ నా ఆటపై దృష్టిపెట్టా’ అని సూర్య చెప్పాడు.
Also Read: Gold Rate Today: మగువలకు భారీ షాక్.. తులం బంగారంపై రూ.810 పెరిగింది!
‘రోహిత్ శర్మతో కలిసి ఆడాను. అంతేకాదు అతడి నాయకత్వంలో చాలా క్రికెట్ ఆడా. నా ఆట గురించి అంతా తెలుసు. ఏం చేయాలనే దాని గురించి పూర్తి అవగాహనతో ఉన్నా. హార్దిక్ పాండ్యా క్రీజ్‌లోకి వచ్చినప్పుడు దూకుడైన ఆటనే కొనసాగించాలని భావించాం. 180 స్కోర్ సాధించడం సంతోషంగా అనిపించింది’ అని సూర్యకుమార్ తెలిపాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధికంగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను దక్కించుకున్న క్రికెటర్‌గా సూర్య నిలిచాడు. 64 మ్యాచుల్లో 15 సార్లు అవార్డు విజేతగా నిలిచాడు.