T20 World Cup 2024 Winner: టీ20 ప్రపంచకప్ విజేత ఆ జట్టే: అక్తర్
- సెమీఫైనల్స్‌కు సమయం ఆసన్నమైంది
- టైటిల్ ఫెవరేట్‌లలో టీమిండియా
- భారత్‌కే నా మద్దతు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shoaib Akhtar Predicts T20 World Cup 2024 Winner: టీ20 ప్రపంచకప్ 2024 సెమీఫైనల్స్‌కు సమయం ఆసన్నమైంది. జూన్ 27న జరిగే తొలి సెమీస్‌లో దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్ జట్లు తలపడనుండగా.. రెండో సెమీస్‌లో ఇంగ్లండ్‌ను భారత్ ఢీకొనబోతోంది. వన్డే ప్రపంచకప్ 2023ని తృటిలో కోల్పోయిన భారత్.. పొట్టి కప్ లక్ష్యంగా సెమీస్‌లో బరిలోకి దిగుతోంది. టైటిల్ ఫెవరేట్‌లలో టీమిండియా కూడా ఒకటి. రోహిత్ సేన పొట్టి కప్ గెలవాలని భారత ఫాన్స్ కోరుకుంటున్నారు. భారత్ టైటిల్ గెలవాలని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ కూడా కోరుకుంటున్నాడు.
వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ ఓటమికి భారత్ బదులు తీర్చుకుంది. టీ20 ప్రపంచకప్ 2024 సూపర్-8 స్టేజ్‌లోనే ఆస్ట్రేలియాను భారత్ ఇంటికి పంపింది. పొట్టి కప్ అందుకునేందుకు ఇంకో రెండడుగుల దూరంలో ఉంది. ప్రపంచకప్ 2023 ఫైనల్ ఓటమికి ఆస్ట్రేలియాపై ప్రతీకారం తీర్చుకున్న భారత జట్టును షోయబ్ అక్తర్ కొనియాడాడు. ‘ఆస్ట్రేలియాపై భారత్ అద్భుత విజయం సాధించింది. గెలవాల్సిన వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఓటమి అనంతరం భారత్ తీవ్ర నిరాశకు లోనైంది. ఆ నిరాశ ప్రతీకారంగా మారింది. ఈ టోర్నీలో ఆస్ట్రేలియాను చిత్తుచేసేలా చేసింది’ అని అక్తర్ అన్నాడు.
Also Read
- India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
Also Read: IND Playing 11: స్టార్ ఆటగాడిపై వేటు.. సంజూకు చోటు! ఇంగ్లండ్‌తో ఆడే భారత్ తుది జట్టు ఇదే
‘ఆస్ట్రేలియాపై రోహిత్ శర్మ చేయాల్సిందంతా చేశాడు. స్టార్క్‌ను ఎదుర్కొన్న తీరు సూపర్. మంచి ఇంటెంట్‌తో ఆడాడు. 150 పరుగులు చేస్తాడనుకున్నా. రోహిత్ ఆలోచనలకు ఓ స్ఫష్టత ఉంది. అతను ట్రోఫీని అందుకోవడానికి అర్హుడు. భారత్ ఈ ప్రపంచకప్‌ను తప్పక గెలవాలి. ట్రోఫీ ఉపఖండంలోనే ఉండాలి. గత వన్డే ప్రపంచకప్‌ను సాధించడానికి మీరు వంద శాతం అర్హులు. భారత్‌కే నా మద్దతు’ అని షోయబ్ అక్తర్ పేర్కొన్నాడు.
తాజావార్తలు
-
El Nino: ‘ఎర్రగా మారిన ప్రపంచం’.. ‘‘సూపర్-డూపర్ ఎల్ నినో’’ ముప్పు.!
-
Chiru – Odela: శ్రీకాంత్ ఓదెలకు చిరంజీవి హ్యాండ్ ఇచ్చారా? నాని మాటల్లో మతలబు ఇదేనా!
-
Stock Market: స్టాక్ మార్కెట్లో బ్లడ్‌బాత్.. ఇన్వెస్టర్లకు చుక్కలు
-
Gyanesh Kumar: CEC జ్ఞానేష్ కుమార్‌కు భారీ మద్దతు.. SIRను సమర్థిస్తూ 42 మంది మాజీ జడ్జీల లేఖ..
-
Dancers Association: డాన్సర్స్ యూనియన్ ఎన్నికలపై హైకోర్టు స్టే!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!