NTV Telugu Site icon

Rohit Sharma Record: సౌరవ్ గంగూలీ రికార్డు బద్దలు కొట్టిన రోహిత్ శర్మ!

Rohit Sharma Record

Rohit Sharma Record

Rohit Sharma become India’s second most successful captain in ICC Events: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఐసీసీ మెగా టోర్నీల్లో భారత్‌కు అత్యధిక విజయాలు అందించిన రెండో కెప్టెన్‌గా రోహిత్ రెకార్డుల్లోకెక్కాడు. టీ20 ప్రపంచకప్‌ 2024 గ్రూప్‌-ఏలో భాగంగా బుధవారం యూఎస్‌ఏతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా గెలవడంతో హిట్‌మ్యాన్ ఖాతాలో ఈ రికార్డు చేరింది. కెప్టెన్‌గా రోహిత్ 20 మ్యాచ్‌ల్లో 17 విజయాలు భారత జట్టుకు అందించాడు. ఈ క్రమంలో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ రికార్డుని హిట్‌మ్యాన్ బద్దలు కొట్టాడు.

ఐసీసీ మెగా టోర్నీల్లో భారత్‌కు అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ ఉన్నాడు. మహీ 58 మ్యాచ్‌ల్లో 41 విజయాలు అందించాడు. ఈ జాబితాలో యూఎస్‌ఏతో మ్యాచ్‌కు ముందు సౌరవ్ గంగూలీతో కలిసి రోహిత్ శర్మ రెండో స్థానంలో ఉన్నాడు. యూఎస్‌ఏ‌పై భారత్ గెలవడంతో గంగూలీ రికార్డును హిట్‌మ్యాన్ బ్రేక్ చేశాడు. రోహిత్ 20 మ్యాచ్‌ల్లో 17 విజయాలు టీమిండియాకు అందించగా.. దాదా 22 మ్యాచ్‌ల్లో 16 విజయాలు అందించాడు. వీరి తర్వాత విరాట్ కోహ్లీ 19 మ్యాచ్‌ల్లో 13 విజయాలను భారత జట్టుకు అందించాడు.

Also Read: Arshdeep Singh: ఎక్కువ పరుగులు ఇచ్చా.. నామీద నమ్మకం ఉంచిన రోహిత్‌కు ధన్యవాదాలు: అర్ష్‌దీప్‌

బుధవారం నసావు కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియంలో అమెరికాతో యూఎస్‌ఏతో మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్ల తేడాతో నెగ్గింది. భారత్ విజయంలో అర్షదీప్ సింగ్ (4-0-9-4), సూర్యకుమార్‌ యాదవ్ (50 నాటౌట్‌; 49 బంతుల్లో 2×4, 2×6), శివమ్‌ దూబే (31 నాటౌట్‌; 35 బంతుల్లో 1×4, 1×6) కీలక పాత్ర పోషించారు. టీ20 ప్రపంచకప్‌ 2024లో భారత్‌ ‘హ్యాట్రిక్‌’ విజయాన్ని అందుకుని.. సూపర్‌-8లోకి అడుగు పెట్టింది.