T20 World Cup 2024: ప్రపంచకప్ చూడాలని లేదు.. రియాన్ పరాగ్ సంచలన వ్యాఖ్యలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Riyan Parag on T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024 కోసం ఎంపిక చేసిన భారత జట్టులో తనకు స్థానం దక్కపోవడంపై రాజస్థాన్ రాయల్స్ యువ ఆటగాడు రియాన్ పరాగ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈసారి ప్రపంచకప్ చూడాలనే ఆసక్తి తనకు లేదని పరాగ్ తెలిపాడు. ఒకవేళ భారత జట్టులో ఉంటే.. టాప్-4 టీమ్‌లు గురించి ఆలోచించేవాడిని అని పేర్కొన్నాడు. ఐపీఎల్ 2024లో అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకున్న రియాన్.. ప్రపంచకప్ కోసం తీసుకుంటారనే చర్చ వచ్చింది. కానీ బీసీసీఐ సెలక్టర్లు మాత్రం అతడికి షాక్ ఇచ్చారు.
టీ20 ప్రపంచకప్ 2024లో మ్యాచ్‌లు జరుగుతున్నాయి. భారత్ తన తొలి మ్యాచ్‌ను జూన్ 5న ఐర్లాండ్‌తో తలపడనుంది. ఇప్పటికే వార్మప్ మ్యాచ్‌లో బంగ్లాపై అద్భుత విజయం సాధించిన భారత్ జోష్ మీదుంది. ఈ మ్యాచ్ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో రియాన్ పరాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘నేను వటీ20 ప్రపంచకప్ జట్టులో ఉండుంటే ఏమమవుతుందనే కంగారు ఉండేది. ఇప్పుడీ నేను టీమ్‌లో లేను. కాబట్టి నాకు పెద్దగా ఆసక్తి లేదు. టాప్-4లో ఎవరు ఉంటారనే దానిపై చర్చ నడుస్తోంది. ఇప్పుడే సమాధానం చెబితే కొన్ని జట్లపై పక్షపాతం చూపించినట్లవుతుంది’ అని రియాన్ అన్నాడు.
Also Read
- India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
Also Read: Super Over: టీ20 ప్రపంచకప్‌లో నరాలు తెగే ఉత్కంఠ.. సూపర్ ఓవర్‌లో నమీబియా విజయం!
‘నిజాయతీగా చెప్పాలంటే అసలు ఈసారి ప్రపంచకప్‌ను చూడాలని నాకు లేదు. మ్యాచ్ చివరికి ఎవరు గెలుస్తారనేది మాత్రమే చూస్తా. నేను ఒకవేళ జట్టులో ఉంటే అప్పుడేమైనా టాప్ -4 టీమ్‌లు గురించి ఆలోచించేవాడినేమో. ఇక మైదానంలో విరాట్ కోహ్లీ చూపించే జోష్‌ను ఎవరూ అందుకోలేరు. అతడు అత్యుత్తమ బ్యాటర్’ అని రియాన్ పరాగ్ పేర్కొన్నాడు. గతేడాది ఐపీఎల్‌లో పెద్దగా రాణించని రియాన్.. తన ప్రవర్తనతో మాత్రం నిత్యం వార్తల్లో నిలిచాడు. ఈసారి మాత్రం అద్భుత ఆటతీరును ప్రదర్శించి అందరి ప్రశంసలు పొందాడు. ఐపీఎల్ 2024లో రాజస్థాన్ రాయల్స్ తరఫున 14 మ్యాచ్‌ల్లో 573 పరుగులు చేశాడు.
తాజావార్తలు
-
Asaduddin Owaisi : ఓట్ల తొలగింపుపై ఒవైసీ ఫైర్.. సెక్రటేరియట్లో కీలక డిమాండ్లు
-
Central Cabinet Decision: SME వృద్ధి నిధికి రూ.10వేల కోట్లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
-
BJP: 13 కోట్ల ఓటర్ల లెక్క ఇదే.. ఫేక్ ఓటర్లకు సపోర్ట్ ఎందుకు? కాంగ్రెస్‌కు బీజేపీ ప్రశ్నలు..
-
Pakistan Cricket: గోల్డ్ మెడల్ వదిలేసి.. ఆ సిక్సరే హైలైట్ అంటున్న పాక్ క్రికెట్!
-
Vivek Bhagat: ‘‘నా ప్రమోషన్ ఆపండి’’.. ఢిల్లీ పోలీస్ అధికారి వివేక్ భగత్
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!