NTV Telugu Site icon

Best Fielder : ఈ సారి ‘బెస్ట్‌ ఫీల్డర్’ అతడే.. వీడియో వైరల్..

Best Fielder

Best Fielder

టీ20 ప్రపంచ కప్ లో భాగంగా బుధవారం ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన సూపర్ 8 మ్యాచ్‌లో భారత్ భారీ విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్‌ తో పాటు ఫీల్డింగ్‌ లోనూ ప్రతిభ కనబరిచాడు టీమిండియా ఆటగాళ్లు. ఇక ఈ మ్యాచ్ లో రవీంద్ర జడేజా (Ravindra Jadeja) ఉత్తమ ఫీల్డర్ (Best Fielder) పతకాన్ని గెలుచుకున్నాడు. ఇది ప్రతి గేమ్ తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌ లో ఇవ్వబడుతుంది. గతంలో ఈ మెడల్ ను అందించడానికి ప్రత్యేక అతిథులను ఆహ్వానించడం ద్వారా ఇచ్చే వారు. అయితే., ఈసారి ప్రదర్శనను భారత కోచ్ రాహుల్ ద్రవిడ్ అందించారు. ఇక బెస్ట్ ఫీల్డర్ అవార్డు కోసం భారత జట్టు కోచ్ దిలీప్ వివరిస్తూ.. అతను చాలా ప్రత్యేకమైనవాడని విజేతగా తన పేరు ప్రకటించగానే రవీంద్ర జడేజా ఆశ్చర్యపోయాడు.

Virat – SKY : ఆ విషయంలో అప్పుడే కోహ్లీ రికార్డును సమం చేసిన సూర్య..

అఫ్ఘనిస్థాన్‌పై అందరూ మెరుగ్గా ఆడారు. మైదానంలో చురుగ్గా ఉన్నారు. శిక్షణలో వారి ప్రదర్శనలాగే, వారు ఆటలో కూడా అద్భుతంగా ప్రదర్శించారు. ఈసారి నలుగురు ఆటగాళ్లు మైదానంలో చాలా యాక్టివ్‌ గా ఉన్నారు. అంతే కాదు, ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించారు. ఇందులో ” మొదటి పార్టిసిపెంట్ అర్ష్‌దీప్ సింగ్. ఆటలో తొలిసారి బాగా ఆడాడు…” అని దిలీప్ వ్యాఖ్యానించారు. అక్షర్ పేరు చెప్పగానే పక్కనే నిల్చున్న విరాట్ కోహ్లీ ముఖంలో విచిత్రమైన హావభావాలను కనపరిచారు.

Vladimir Putin – Kim Jong Un : కిమ్ ను సరదాగా కారులో తిప్పిన పుతిన్.. వీడియో వైరల్..

కొత్త అతిధి ఎవరు..? అని అందరూ ఎదురు చూస్తుంటే… ‘‘ఎవరూ లేరు. ఎప్పుడూ మాతో ఉండే మన ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ ( Rahul Dravid) మెడల్ ను అందిస్తాడు అనడంతో చప్పట్లతో టీమిండియా అత్తగాళ్ళు ద్రావిడ్ ను ఉత్సహ పెట్టారు. ద్రావిడ్ నుంచి జడేజా ఈ పతకాన్ని అందుకున్నాడు. ఈ సందర్భంగా జడేజా తన కోచ్‌ని సంతోషంతో పైకి ఎత్తుకోవడం గమనార్హం. ఆ తర్వాత రవీంద్ర జడేజా మాట్లాడుతూ.. సిరాజ్ ను చూపిస్తూ ఈ ప్రయత్నానికి అతనే తన ప్రేరణ అంటూ కాస్త ఫన్నీ గా వ్యాఖ్యానించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ తన అధికారిక సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేయడంతో వీడియో కాస్త వైరల్ గా మారింది.