NTV Telugu Site icon

IND vs BAN: భారత్, బంగ్లాదేశ్ ‘సూపర్’ పోరు.. మ్యాచ్‌కు భారీ అడ్డంకి!

Ind Vs Ban

Ind Vs Ban

Rain Likely To Interrupt IND vs BAN Match: టీ20 ప్రపంచకప్ 2024 సూపర్-8 పోరులో భాగంగా మరికొద్దిగంటల్లో భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్ జరగనుంది. ఆంటిగ్వా వేదికగా ఇవాళ రాత్రి 8 గంటలకు (ఆంటిగ్వాలో ఉదయం 10.30 గంటలకు) మ్యాచ్ ఆరంభం కానుంది. అఫ్గానిస్థాన్‌పై ఘన విజయం సాధించిన భారత్.. బంగ్లాను మట్టికరిపించి సెమీఫైనల్ చేరాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు ఆస్ట్రేలియాతో చేతిలో ఓటమిపాలైన బంగ్లా.. టీమిండియాపై గెలవాలని ఉవ్విళూరుతోంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఫెవరేట్ అయినా.. బంగ్లాను తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు.

ఆటింగ్వా మైదానంలో జరిగిన బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగించాడు. ఆ మ్యాచ్ ఫలితం డక్‌వర్త్‌లూయిస్‌ పద్ధతి ప్రకారమే తేలింది. ప్రస్తుతం ఆంటిగ్వాలో చిన్నపాటి వర్షం పడింది. అక్కడి వెదర్‌ రిపోర్ట్‌ ప్రకారం.. మ్యాచ్‌ ప్రారంభమయ్యే సమయానికి ఆకాశం మొత్తం మబ్బులు పట్టి ఉంటాయని తెలుస్తోంది. చిరు జల్లులు పడే అవకాశం ఉందట. వర్షంతో మ్యాచ్‌కు అంతరాయం కలిగే ప్రమాదం లేకపోలేదు.

Also Read: Redmi Note 13 Pro: సరికొత్త కలర్‌లో ‘రెడ్‌మీ నోట్‌ 13 ప్రో’.. ధర ఎంతంటే?

భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్‌ పూర్తిగా రద్దయ్యే పరిస్థితి ఉండదని వాతావరణ శాఖ పేర్కొంది. ఓవర్ల కోత లేకుండానే మ్యాచ్‌ జరిగేందుకు ఎక్కువ ఆస్కారం ఉంది. వర్షం కారణంగా భారత్-బంగ్లా మ్యాచ్ టాస్‌ కాస్త ఆలస్యం కావచ్చట. అయితే అదేమీ ఓవర్లపై ప్రభావం చూపదని తెలుస్తోంది. మొత్తానికి వరణుడు మ్యాచ్‌కు అడ్డంకిగా మారాడు. ఒకవేళ మ్యాచ్‌ రద్దైతే.. ఇరు జట్లకు ఒక్కో పాయింట్ దక్కుతుంది. మ్యాచ్‌ జరిగి బంగ్లాపై భారత్ విజయం సాధిస్తే సెమీస్‌ బెర్తు ఖాయమవుతుంది. వరుసగా రెండు ఓటములతో బంగ్లా ఇంటిముఖం పట్టక తప్పదు.