బ్లాక్స్ లైఫ్ మ్యాటర్ అనేది ప్రస్తుతం ఐసీసీ టీ20 ప్రపంచ కప్ టోర్నీలో కనిపిస్తుంది. ప్రతి జట్టు దీనికి మద్దతుగా మ్యాచ్ ప్రారంభానికి ముందు మోకాళ్లపైన కూర్చుంటుంది. గత ఆదివారం పాకిస్థాన్ జట్టుతో మ్యాచ్ ఆడిన సమయంలో మన భారత ఆటగాళ్లు కూడా ఇలా చేసారు. ఇక ఈరోజు వెస్టిండీస్ , సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సమయంలో బ్లాక్స్ లైఫ్ మ్యాటర్ ఓ వివాదానికి తెర లేపింది. అయితే ఈ ప్రారంభ సమయంలో అందరూ మోకాళ్లపైన కూర్చోవాలని సౌత్ ఆఫ్రికా ఆటగాళ్లకు ఆ జట్టు బోర్డు సూచించింది. కానీ దాని ఆ జట్టు మాజీ కెప్టెన్ ప్రస్తుత ఓపెనట్ క్వింటన్ డికాక్ ఒప్పుకోలేదు. దాంతో మ్యాచ్ ప్రారంభానికి కొత్త సమయం ముందు అతడిని జట్టులోనుంచి తీసేసింది. ఈ విషయాన్ని మ్యాచ్ అనంతరం అధికారికంగా సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ విషయంపై తీసుకునే చర్యలు ఏమైనా ఉంటె తర్వాత తీసుకుంటామని కూడా పేర్కొంది.