India-England SemiFinal: ఇండియా-ఇంగ్లాండ్ సెమీఫైనల్ మ్యాచ్ వర్షంతో రద్దు అయితే ఎలా.. ఎవరు ఫైనల్‌కు వెళతారు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India-England SemiFinal: ICC T20 ప్రపంచ కప్ 2026 సెమీఫైనల్ పోరు బుధవారం (మార్చి 4న) కోల్‌కతాలో ప్రారంభం కాబోతోంది. తొలి సెమీఫైనల్‌లో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ తలపడబోతున్నాయి. గురువారం (మార్చి 5)న జరిగే రెండో సెమీ ఫైనల్‌లో భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ ముంబై వాంఖడే స్టేడియం వేదికగా జరగనుంది.
అయితే, వర్షం కారణంగా మ్యాచ్‌లు రద్దయితే ఎలా అని క్రికెట్ ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు. కీలమైన సూపర్ -8 మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను ఓడించడం ద్వారా భారత్ సెమీఫైనల్స్‌లోకి ప్రేవేశించింది. ఇప్పుడు, ఫైనల్ టార్గెట్‌గా టీమిండియా ఆడబోతోంది. మరోవైపు, ఇంగ్లాండ్ సూపర్-8లో మంచి ప్రదర్శన చేసింది. ఈ రెండు జట్ల మధ్య సెమీఫైనల్ రసవత్తరంగా మారబోతోంది.
Also Read
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
- Women's T20 World Cup 2026 : పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
1)రిజర్వ్ డే:
భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయితే పరిస్థితి ఏంటనే ఆలోచనలు వస్తున్నాయి. ఈ మ్యాచ్ రద్దు అయితే ఐసీసీ రిజర్వ్ డేను కేటాయించింది. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం మ్యాచ్ గురువారం మార్చి 5న సాధ్యం కాకపోతే, మార్చి 6, శుక్రవారం మ్యాచ్‌ను నిర్వహిస్తారు.
మ్యాచ్ ఎక్కడ ఆగిపోయిందే, రిజర్వ్ డేలో అక్కడి నుంచి ప్రారంభిస్తారు. ఒక వేళ టాస్ పడి ఆట మొదలు కాకపోతే, రిజర్వ్ డే నాడు మళ్లీ టాస్ వేయరు. అదే టాస్, అదే ఆటగాళ్లలో బరిలోకి దిగాల్సి వస్తుంది.
2)అదనపు సమయం:
మ్యాచ్‌కు ఆటంకం ఏర్పడితే ఫలితం తేల్చడానికి అంపైర్లు అదనంగా గురువారం 90 నిమిషాలు, శుక్రవారం 120 నిమిషాల సమయం కేటాయిస్తారు.
3)కనీస ఓవర్ల నిబంధన:
సెమీస్ ఫలితం తేలాలంటే, రెండు జట్లు కనీసం 10 ఓవర్లు ఆడాలి. వర్షం వల్ల ఓవర్లు తగ్గించినా, కనీసం 10 ఓవర్ల ఆట సాధ్యమైతే విజేత ఎవరనేది తేలుతుంది.
5)రెండో రోజు వర్షం పడితే మ్యాచ్ రద్దయితే..?:
ఒక వేళ నిర్ణీత రోజు అంటే గురువారం, రిజర్వ్ డే శుక్రవారం కూడా వర్షం వల్ల మ్యాచ్ పూర్తిగా రద్దయితే, విజేతను సూపర్-8 పాయింట్ ఆధారంగా ప్రకటిస్తారు.
ఇదే జరిగితే సూపర్-8 గ్రూప్‌లో మూడు విజయాలతో ఇంగ్లాండ్ టాప్‌లో ఉంది. నేరుగా ఇంగ్లాండ్ ఫైనల్‌కు చేరుకుంటుంది. భారత్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.
తాజావార్తలు
-
Mamitha Baiju: ప్రముఖ హీరోయిన్ మమిత బైజుకు అస్వస్థత.. ఆస్పత్రిలో చికిత్స
-
Story Board: తెలంగాణ కాంగ్రెస్ రాజకీయం ఏ మలుపు తిరుగుతుంది..?
-
Swara Bhasker: ఇతర మహిళల్ని గౌరవించడం నేర్చుకో.. స్వరా భాస్కర్ వ్యాఖ్యలపై బీజేపీ..
-
CM Vijay: సీఎం విజయ్ను కలిసిన టీఎంసీ రెబెల్ ఎంపీ సయానీ ఘోష్
-
YS Jagan: నీటి విడుదలపై పొలిటికల్ వార్.. క్రెడిట్ కోసం చంద్రబాబు ఆరాటం.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!