Arshdeep Singh: ఎక్కువ పరుగులు ఇచ్చా.. నామీద నమ్మకం ఉంచిన రోహిత్‌కు ధన్యవాదాలు: అర్ష్‌దీప్
- 9 రన్స్ ఇచ్చి 4 వికెట్స్
- వికెట్లే లక్ష్యంగా బంతులు
- రోహిత్‌కు ధన్యవాదాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arshdeep Singh Thanks Rohit Sharma For Belief: టీ20 ప్రపంచకప్ 2024లో ఆడిన గత రెండు మ్యాచ్‌ల్లో ఎక్కువ పరుగులు ఇచ్చానని, యూఎస్ఏపై తన ప్రదర్శనతో అసంతృప్తిగా ఉన్నానని భారత యువ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ తెలిపాడు. గత రెండు మ్యాచ్‌ల్లో ఎక్కువ రన్స్ ఇచ్చినా.. తనపై నమ్మకం ఉంచిన టీమిండియా మేనేజ్మెంట్, కెప్టెన్ రోహిత్ శర్మకు ధన్యవాదాలు అని పేర్కొన్నాడు. పరుగులు చేయడానికి ఎలాంటి ఆస్కారం ఇవ్వకుండా బంతులేశాం అని చెప్పాడు. సూపర్ 8లోనూ ఇదే బౌలింగ్‌తో గెలిచేందుకు ప్రయత్నిస్తాం అని అర్ష్‌దీప్ చెప్పుకొచ్చాడు. టీ20 ప్రపంచకప్ 2024 గ్రూప్-ఏలో భాగంగా బుధవారం యూఎస్ఏతో జరిగిన మ్యాచ్‌లో అర్ష్‌దీప్ (4-0-9-4) అద్భుతమైన గణాంకాలు నమోదు చేశాడు.
యూఎస్ఏతో జరిగిన మ్యాచ్‌లో అర్ష్‌దీప్ సింగ్ తన కోటా నాలుగు ఓవర్లలో కేవలం 9 రన్స్ ఇచ్చి 4 వికెట్స్ తీశాడు. అద్భుత బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన అర్ష్‌దీప్‌కే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా అర్ష్‌దీప్ మాట్లాడుతూ… ‘గత రెండు మ్యాచ్‌ల్లో నేను ఎక్కువ పరుగులు ఇచ్చా. ఇప్పుడు నా ప్రదర్శనతో అసంతృప్తిగా ఉన్నా. జట్టు ఎప్పుడూ నాపై నమ్మకాన్ని ఉంచింది. నాకు అండగా నిలిచింది. నా మీద నమ్మకం ఉంచిన టీమ్ మేనేజ్మెంట్, కెప్టెన్‌కు ధన్యవాదాలు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే.. నేను మంచి ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్‌ల్లో రాణించినందుకు సంతోషంగా ఉంది’ అని తెలిపాడు.
Also Read
- India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
Also Read: Arshdeep Singh Record: ప్రపంచకప్‌లో తొలి బౌలర్‌గా అర్ష్‌దీప్ సింగ్ అరుదైన రికార్డు!
‘పిచ్ పేసర్లకు అనుకూలంగా ఉంది. వికెట్లే లక్ష్యంగా బంతులు వేయాలని మేం అనుకున్నాం. అందుకు తగ్గట్టుగానే బౌలింగ్ చేశా. ప్రత్యర్థి బ్యాటర్లు పరుగులు చేయకుండా బంతులేశాం. ఇలాంటి పిచ్‌పై ఎక్కువ పరుగులు ఇస్తే.. లక్ష్య ఛేదన మరింత క్లిష్టంగా మారుతుంది. మా బ్యాటర్లు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. అంతర్జాతీయ మ్యాచ్ ఆడేటప్పుడు పిచ్ పరిస్థితులను త్వరగా అర్థం చేసుకోవాలి. బౌలర్లు అందరూ రాణించడంతో యూఎస్ఏని తక్కువ స్కోరుకే కట్టడి చేశాం. ఇదే బౌలింగ్‌తో సూపర్ 8లోనూ గెలిచేందుకు ప్రయత్నిస్తాం’ అని అర్ష్‌దీప్ సింగ్ చెప్పాడు.
తాజావార్తలు
-
Shiva: జపాన్‌లో నాగార్జున ‘శివ’ సునామీ.. జపాన్ ఫ్యాన్స్ ఇచ్చిన ఆ బిరుదు చూశారా?
-
Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
-
Mobile Phone Blast: పిడుగుపాటుకు జేబులో పేలిన సెల్‌ఫోన్.. విద్యుత్ ఉద్యోగి మృతి
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
ట్రెండింగ్
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..