NTV Telugu Site icon

IND vs PAK: టీమిండియాదే బ్యాటింగ్.. తుది జట్లు ఇవే!

Ind Vs Pak

Ind Vs Pak

IND vs PAK Playing 11: టీ20 ప్రపంచక‌ప్‌ 2024లో చిర‌కాల ప్ర‌త్య‌ర్థులు భార‌త్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ మరికాసేపట్లో షురూ కానుంది. ఈ హై వోల్టేజ్‌ మ్యాచ్ న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. పాక్ ఒక మార్పుతో బరిలోకి దిగుతుండగా.. భారత్ తుది జట్టులో ఎలాంటి మార్పు చేయలేదు.

భార‌త్, పాకిస్థాన్ మ్యాచ్‌కు ఆతిథ్యమిస్తున్న న్యూయార్క్‌లో కొద్దిసేపటి క్రితం వర్షం కురిసింది. అవుట్ ఫీల్డ్ తడిగా ఉండడంతో టాస్ ఆలస్యమైంది. 7:45 నిమిషాలకు అంపైర్లు మైదానాన్ని పరిశీలించారు. మ్యాచ్‌కు పిచ్ సిద్ధంగా ఉండడంతో 8 గంటలకు టాస్ పడింది. ఓవర్ల కుదింపు లేకుండా 8.30 గంటల నుంచి మ్యాచ్‌ ప్రారంభం కానుంది.

తుది జట్లు ఇవే:
భారత్‌: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), విరాట్ కోహ్లీ, రిషభ్‌ పంత్ (వికెట్ కీపర్‌), సూర్యకుమార్, హార్దిక్ పాండ్య, శివమ్‌ దూబె, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌, అర్ష్‌దీప్ సింగ్.
పాకిస్తాన్: మహ్మద్ రిజ్వాన్, బాబర్‌ అజామ్ (కెప్టెన్‌), ఉస్మాన్ ఖాన్‌, ఫకర్‌ జమాన్, షాదాబ్‌ ఖాన్, ఇఫ్తికర్‌ అహ్మద్, ఇమాద్‌ వసీం, షహీన్‌ షా అఫ్రిది, హారిస్‌ రవూఫ్, మహమ్మద్‌ అమీర్, నసీం షా.

Show comments