Site icon NTV Telugu

Hardik Pandya దెబ్బకు సోషల్ మీడియా షేక్.. “No-Look Wicket” అంటూ వీడియో వైరల్!

Hardik Pandya

Hardik Pandya

Hardik Pandya ‘No-Look’ wicket: కొలంబో వేదికగా జరిగిన ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌ లో భారత్ పాకిస్తాన్‌ను 61 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసింది. ఈ విజయంలో టర్నింగ్ పాయింట్ అంటే.. పవర్‌ప్లేలో భారత బౌలర్ల దూకుడను నిస్సందేహంగా చెప్పవచ్చు. ఇది ఇలా ఉండగా.. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.

Jangaon Municipality: జనగామ మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక వాయిదా..

కొత్త బంతిని అందుకున్న హార్దిక్ పాండ్యా మొదటి ఓవర్‌నే మేడిన్ గా పూర్తి చేయడమే కాకుండా.. పాకిస్తాన్ ఓపెనర్ సాహిబీజాడా ఫర్హాన్ ను ఔట్ చేశాడు. మొదటి ఓవర్ నాలుగో బంతికి ఫర్హాన్ పుల్ షాట్ ప్రయత్నించగా.. అది బంతి గాల్లోకి లేచింది. అయితే ఇక్కడే ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. క్యాచ్ పూర్తయ్యిందో లేదో చూసేందుకు కూడా వెనక్కి తిరిగి చూడకుండా పాండ్యా ముందుకు నడుస్తూ బ్యాటర్ నే తదేకంగా చూస్తూ ముందుకు నడుస్తూ వచ్చాడు. ఇందుకు సంబంధించిన హార్దిక్ పాండ్యా ఆటిట్యూడ్ వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.

Salman Ali Agha: ఏంట్రా బాబు ఆ మాట్లాడడం.. నవ్వులపాలైన పాకిస్తాన్ కెప్టెన్! వీడియో వైరల్..

రింకు సింగ్ క్యాచ్ పూర్తి చేసిన వెంటనే ఇతర భారత ఆటగాళ్లు ఆనందంలో మునిగిపోయినా.. పాండ్యా మాత్రం పెద్దగా సెలబ్రేట్ చేయకుండా ప్రశాంతంగా కనిపించాడు. ఈ వీడియో వైరల్ కావడంతో అభిమానులు అతని రియాక్షన్‌ను “ఆరా ఫార్మింగ్” (aura farming) అంటూ ప్రశంసిస్తున్నారు. మరికొందరేమో ‘నో-లుక్’ వికెట్ అంటూ పెద్దెత్తున వీడియోను తెగ షేర్ చేస్తున్నారు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో భారత్ ఆధిపత్యం చాటగా.. హార్దిక్ పాండ్యా ‘నో-లుక్’ వికెట్ క్షణం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.

Exit mobile version