Site icon NTV Telugu

Shoaib Akhtar: రోహిత్ శర్మ, కోహ్లి రిటైర్మెంట్ పై పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ కీలక వ్యాఖ్యలు

New Project (47)

New Project (47)

టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో భారత జట్టు విజయం సాధించింది. ఫైనల్లో భారత్ 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. భారత్ విజయంలో విరాట్ కోహ్లీ 76 పరుగులు చాలా కీలకం. దీంతో పాటు బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా అద్భుతంగా బౌలింగ్ చేసి భారత్‌కు చారిత్రాత్మక విజయాన్ని అందించారు. టీ20 ఇంటర్నేషనల్ నుంచి రోహిత్ శర్మ మరియు కోహ్లి రిటైర్మెంట్ గురించి మాజీ పాకిస్థానీ లెజెండ్ షోయబ్ అక్తర్ స్పందించాడు.

READ MORE: Hardik Pandya: అనుకోని విషయాలు జరిగిపోయాయి.. ఒక్క మాట కూడా మాట్లాడలేదు!

రోహిత్ రిటైర్మెంట్‌పై, అక్తర్ తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడారు. “చూడండి, ఇది చాలా మంచి నిర్ణయం. ఇద్దరూ సరైన సమయంలో T20కి దూరం కావాలని నిర్ణయించుకున్నారు. గొప్ప ఆటగాళ్లు ఏమి చేయగలరో నిరూపించారు. T20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత.. ఇద్దరు ఆటగాళ్లు T20 ఇంటర్నేషనల్ నుంచి వీడుతున్నారు. కానీ.. రోహిత్ మరిన్ని టీ20లు ఆడగలడని నేను నమ్ముతున్నాను. గత మూడు-నాలుగేళ్లుగా రోహిత్ చాలా కష్టపడ్డాడు. అతడి నుంచి కెప్టెన్సీ తీసేశారు. ప్రపంచకప్‌లో ఓడిన తర్వాత ముంబై ఇండియన్స్‌ కెప్టెన్సీ అతడికి దూరమైంది. ఆ తర్వాత మళ్లీ టీ-20కి సిద్ధమయ్యే అవకాశం వచ్చింది. అతని ప్రయాణం రోలర్ కోస్టర్. రోహిత్ మరిన్ని టీ20 మ్యాచ్‌లు ఆడాలని నేను కోరుకున్నాను కానీ అతను నిర్ణయం తీసుకున్నాడు. ఇది కఠినమైన నిర్ణయం.” అని వ్యాఖ్యానించారు. అక్తర్ కోహ్లీ మరియు రోహిత్‌లను ప్రపంచ క్రికెట్‌లో గొప్ప ఆటగాళ్లుగా పరిగణించాడు. అయితే సచిన్ కంటే గొప్ప ఆటగాడు ప్రపంచంలో లేడని మాజీ పాకిస్థానీ లెజెండ్ అంగీకరించినప్పటికీ..అతని తర్వాత ఆ స్థానాన్ని కోహ్లీ, రోహిత్ లకు ఇచ్చారు.

Exit mobile version