NTV Telugu Site icon

SiX Sixes : హమ్మయ్య.. యూవీ రికార్డ్ సేఫ్.. లేకుంటేనా..

Buttler

Buttler

SiX Sixes : ప్రస్తుతం జరుగుతున్న టి20 ప్రపంచ కప్ లో గ్రూప్ దశలో ఓడిపోయిన డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ సూపర్ 8 డిసైడర్‌ లో అమెరికాకు చుక్కలు చూపించింది. తప్పక గెలవాల్సిన గేమ్‌లో అమెరికాపై తిరుగులేని విజయం సాధించింది. నెట్ రన్ రేట్ ను గణనీయంగా మెరుగుపరిచింది. దీంతో సెమీఫైనల్‌ లో మొదటి చోటు దక్కించుకుంది ఇంగ్లాండ్ జట్టు. ఆదివారం అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 62 బంతులు మిగిలి ఉండగానే 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Viral Video: రీల్స్ కోసం థార్ కార్లను సముద్రంలోకి తీసుకెళ్లిన యువకులు.. చివరికి ఏమైందంటే..?

ఈ మ్యాచ్‌ లో అమెరికా తొలుత బ్యాతింగ్ చేయగా.. 18.5 ఓవర్లలో 115 పరుగులకే ఆలౌటైంది. ఇక చిన్న ల‌క్ష్య ఛేద‌న‌లో భాగంగా ఇంగ్లాండ్ ఓపెన‌ర్లు ఆకాశ‌మే హ‌ద్దుగా అమెరికా ఆటగాళ్లకు పట్టాపగలే చుక్కలు చూపించారు. ముఖ్యంగా ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బ‌ట్ల‌ర్ శివతాండవం చేసాడు. 38 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్స‌ర్లతో మెరుపు ఇన్నింగ్స్ తో 83 నాటౌట్ గా నిలిచాడు. బ‌ట్ల‌ర్ కు తోడుగా ఫిలిప్ సాల్ట్ 21 బంతుల్లో 25 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచి చ‌క్క‌ని స‌హ‌కారం అందించాడు. దీంతో ల‌క్ష్యాన్ని ఇంగ్లాండ్ సునాయాసంగా 9.4 ఓవ‌ర్ల‌లో వికెట్ న‌ష్ట‌పోకుండా విజయం సాధించింది.

Nara Brahmani : నువ్వేంటో తెలియజేశావు.. లోకేష్‌పై బ్రాహ్మణి ఆసక్తికర ట్వీట్‌

ఇకపోతే 2007లో జరిగిన తొలి టీ20 ప్రపంచకప్‌లో భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టిన సంగతి ఇంకా ఎవరు మరిచిపోయిండరు. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సువ‌ర్ట్ బ్రాడ్ యువీ బౌలింగ్‌ లో అన్ని బంతుల్లో సిక్సర్లు బాదాడు. అమెరికాతో జరిగిన చివరి మ్యాచ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ దాదాపు ఈ రికార్డును సాధించాడు. అమెరికా పేసర్ హర్మీత్ సింగ్ వేసిన ఎనిమిదో ఓవర్లో బట్లర్ విధ్వంసం సృష్టించాడు. వరుసగా ఐదు సిక్సర్లు బాదాడు. ఫిలిప్ సాల్ట్ మొదటి బంతికి సింగిల్ కొట్టాడు. ఆపై బ్యాటింగ్ కు వచ్చిన బట్లర్ ఆరు బంతుల్లో వరుసగా నాలుగు బంతులలో సిక్సర్లును బాదాడు. దీంతో ఒత్తిడికి లోనైన హర్మీత్ సింగ్ వైడ్ వేసాడు. ఇక ఆ తర్వాత చివరి బంతిని కూడా బట్లర్ వదల్లేదు. దానిని కూడా పెద్ద సిక్స్‌ గా మార్చాడు. ఈ ఓవర్‌లో మొత్తం 32 పరుగులు వచ్చాయి. మొదటి బంతిని ఫిలిప్ సాల్ట్ స్ట్రైక్ లో ఉన్నాడు కాబ్బటి సరిపోయింది కానీ.. బట్లర్ ఫామ్‌ను బట్టి చూస్తే, బట్లర్ యువీ సిక్సర్ల రికార్డును సమానం చేసేవాడే.