NTV Telugu Site icon

IND vs SA Final: రాణించిన విరాట్ కోహ్లీ, అక్షర్ పటేల్.. దక్షిణాఫ్రికా లక్ష్యం?

New Project (8)

New Project (8)

IND vs SA Final: టీ20 ప్రపంచకప్‌ ఫైనల్ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో మంచి స్కోరును సాధించింది. భారత్ 7 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. 77 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా ముంగిట ఉంచింది. విరాట్‌ కోహ్లీ (76), అక్షర్ పటేల్(47) రాణించారు.

READ MORE: UP: యూపీలో అఖిలేష్ యాదవ్ పోస్టర్లు కలకలం.. ప్యూచర్ పీఎం అంటూ ఫ్లెక్సీలు

ఓపెనర్ విరాట్ కోహ్లీ 59 బంతుల్లో 76 పరుగులు చేయగా.. అక్షర్ పటేల్ 31 బంతుల్లో 47 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడారు. బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ప్రారంభంలోనే ఎదురుదెబ్బ తగలగా.. విరాట్ కోహ్లీ క్రీజులో ఉండి ఇన్నింగ్స్‌ను చక్కబెట్టాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 9 పరుగులకే ఔటయ్యాడు. మహరాజ్‌ బౌలింగ్‌లో క్లాసెన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. రిషబ్ పంత్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. సూర్యకుమార్‌ యాదవ్‌(3) కూడా షాట్‌కు ప్రయత్నించి ఓట్‌ కాగా.. కష్టాల్లో పడిన భారత్‌ను ఆదుకునేందుకు కోహ్లీ అక్షర్‌ పటేల్‌తో కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో అన్రిచ్ నోర్ట్జే,రబాడ రెండేసి వికెట్లు తీయగా.. షంసి, యన్సెన్‌లు తలో వికెట్‌ తీశారు.