NTV Telugu Site icon

T20 World Cup 2024: ఉన్నపళంగా స్వదేశానికి ఇద్దరు భారత ఆటగాళ్లు.. కారణం ఏంటంటే?

Avesh Khan, Shubman Gill

Avesh Khan, Shubman Gill

Shubman Gill and Avesh Khan Out Form T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌ 2024లో హ్యాట్రిక్ విజయాలతో గ్రూప్-ఏ నుంచి భారత్ సూపర్‌ 8కు దూసుకెళ్లింది. లీగ్ స్టేజ్‌లో కెనడాతో శనివారం చివరి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే.. టేబుల్ టాపర్‌గా టీమిండియా లీగ్ దశను ముగిస్తుంది. ఫ్లోరిడాలో కెనడాతో మ్యాచ్ అనంతరం కరేబియన్ దీవులకు రోహిత్ సేన పయనమవుతుంది. సూపర్-8, సెమీ ఫైనల్స్, ఫైనల్స్ అక్కడే ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో భారత్ మేనేజ్మెంట్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఫ్లోరిడా నుంచి భారత జట్టు వెస్టిండీస్‌కు బయలుదేరనుండగా.. శుభ్‌మన్ గిల్, అవేశ్ ఖాన్ మాత్రం స్వదేశానికి తిరిగి రానున్నట్లు తెలుస్తోంది. టీ20 ప్రపంచకప్‌ 2024లో గిల్‌, అవేశ్‌తో పాటు రింకూ సింగ్‌, ఖలీల్‌ అహ్మద్‌ రిజర్వ్ ప్లేయర్లుగా ఎంపికైన విషయం తెలిసిందే. 15 మంది ఆటగాళ్లలో ఎవరైనా గాయపడితే.. వీరికి అవకాశం దక్కుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రోహిత్‌ శర్మతో పాటు విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేస్తున్నాడు. దాంతో యశస్వీ జైస్వాల్ బ్యాకప్ ఓపెనర్‌గా బెంచ్‌కు పరిమితమవుంటున్నాడు. దీంతో ప్రపంచకప్‌లో గిల్ సేవలు అవసరం లేదని భావించిన టీమ్ మేనేజ్మెంట్ అతన్ని స్వదేశానికి పంపించడానికి సిద్ధమైంది.

Also Read: T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ చరిత్ర.. శ్రీలంక రికార్డ్ బ్రేక్!

వెస్టిండీస్‌లో పిచ్‌లు స్పిన్నర్లుకు అనుకూలం. దీంతో భారత్ ఇద్దరు పేసర్లతోనే బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. జస్ప్రీత్ బుమ్రాతో అర్షదీప్ సింగ్ ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మొహమ్మద్ సిరాజ్‌ బెంచ్‌కు పరిమితం అవుతాడు. హార్దిక్ కూడా కూడా ఫాస్ట్ బౌలర్‌గా ఉపయోగపడనున్నాడు. దీంతో ఓ ఫాస్ట్ బౌలర్ గాయపడినా.. అవేశ్‌తో అవసరం ఉండదని జట్టు యాజమాన్యం భావిస్తోంది. ఖలీల్ అహ్మద్, రింకూ సింగ్ రిజర్వ్ ప్లేయర్‌గా జట్టుతో పాటే ఉండనున్నారు.